News February 28, 2026

కాలసర్ప దోషం పోవాలంటే?

image

కాలసర్ప దోష నివారణకు సోమవారం నల్ల నువ్వులతో శివాభిషేకం, మహా మృత్యుంజయ మంత్ర పఠనం చేయాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ‘నాగపంచమి నాడు నాగేంద్రుని పూజించాలి. వెండి పాముల జతను నదిలో వదిలితే దోష తీవ్రత తగ్గుతుంది. శనివారం రావిచెట్టుకు నీరు పోసి 7 ప్రదక్షిణలు చేయాలి. పేదలకు నల్ల దుప్పట్లు దానం చేయాలి. నాసిక్‌లో శాంతి పూజలు నిర్వహించడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయి’ అని అంటున్నారు.

Similar News

News March 1, 2026

నేటి సామెత: కసవు ఉంటేనే పశువు

image

‘కసవు’ అంటే గడ్డి లేదా పశుగ్రాసం. పశువుల దగ్గర మేత (గడ్డి) పుష్కలంగా ఉంటేనే ఆ పశువు ఆరోగ్యంగా ఉంటుంది, పాలిస్తుంది, వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుంది. మేత లేని పశువు నీరసించిపోతుంది. అందుకే పశువు మనకు ఉపయోగపడాలి అంటే, దానికి మనం సరైన ఆహారాన్ని అందించాలి. దానికి మనం ఇచ్చే దానిని బట్టే మనకు వచ్చే ఫలితం ఆధారపడి ఉంటుంది.”పెట్టుబడి లేనిదే లాభం రాదు” అనే విషయాన్ని ఈ సామెత తెలియజేస్తుంది.

News March 1, 2026

నేడు 444 విమానాలు రద్దు!

image

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్ నేపథ్యంలో ఈరోజు 444 విమానాలు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. విమానయాన సంస్థలతో డీజీసీఏ టచ్‌లో ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపింది. ప్రయాణికులు ముందుగానే ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించి ఎయిర్‌పోర్టుకు బయలుదేరాలని సూచించింది. ప్రయాణికులు AirSewa ద్వారా సమస్యలను తెలపొచ్చని పేర్కొంది. కాగా నిన్న 410 డొమెస్టిక్ ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి.

News March 1, 2026

మంచి మనసు చాటుకున్న విజయ్-రష్మిక

image

ఇటీవల ఏడడుగుల బంధంతో ఒక్కటైన విజయ్ – రష్మిక జంట మంచి మనసు చాటుకుంది. ఈరోజు దేశంలోని అనేక రాష్ట్రాల్లో మిఠాయిలు పంచుతూ, ఆలయాల్లో అన్నదానం నిర్వహిస్తూ తమ వివాహాన్ని సెలబ్రేట్ చేసుకోనుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, యూపీ, అస్సాం రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ఈ జంట నేడు అన్నదానం నిర్వహిస్తారు. అలాగే ఏపీ, టీజీ సహా రాష్ట్రాల్లోని నగరాల్లో స్వీట్లను పంచనున్నారు.