News August 28, 2025

కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు: APSDMA

image

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉందని, నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అలాగే, పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ఆయన ప్రజలను హెచ్చరించారు.

Similar News

News September 2, 2025

మేరికపూడిలో విషాదం.. తండ్రీకొడుకుల దుర్మరణం

image

ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు మృతిచెందారు. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో భార్గవ్ (23) అక్కడికక్కడే మరణించగా, ఆయన తండ్రి వెంకటేశ్వర్లు (55) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి స్థానికులను కంటతడి పెట్టించింది.

News September 2, 2025

తెనాలిలో 108 మంది వీణ కళాకారులతో సంగీత ఉత్సవం

image

తెనాలికి చెందిన శ్రీ విద్యాపీఠం, సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన వీణ సంగీత ఉత్సవం జరుగనుంది. మూలా నక్షత్రం సందర్భంగా చెంచుపేటలోని పద్మావతి కల్యాణ మండపంలో ఆరోజు సాయంత్రం 5.15 గంటలకు సంగీత ఉత్సవం ప్రారంభమవుతుందని పెనుగొండ శ్రీ వాసవి క్షేత్ర పీఠాధిపతి బాల స్వామీజీ తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన 108 మంది వీణ కళాకారులతో తెనాలిలో తొలిసారిగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

News September 2, 2025

గుంటూరు జిల్లా నిరుద్యోగులకు ముఖ్య గమనిక

image

గుంటూరు జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ఆఫీసర్, ఎఫ్ఎస్ఓ, సోషల్ వర్కర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో ఎంపికైన వారికి ఇప్పటికే నియామకాలు ఇచ్చామని అధికారులు తెలిపారు. రెండో విడత ఎంపిక జాబితాను సిద్ధం చేసి జిల్లా వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటలకు డీఎంహెచ్ కార్యాలయంలో ధ్రువపత్రాలతో హాజరావాలన్నారు.