News April 7, 2025
కాలువలో స్నానానికి దిగి యువకుడు గల్లంతు

రావులపాలెం మండలం గోపాలపురం బ్యాంక్ కాలవలో ఈతకోట నెక్కంటి కాలనీకి చెందిన షేక్ ఖాదర్ (21) ఆదివారం గల్లంతయ్యాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి మధ్యాహ్నం గోపాలపురం ఆరుమామిళ్ల రేవు వద్దకు స్నానానికి వెళ్లాడు. ఈత కొడుతూ ఖాదర్ గల్లంతయ్యాడు. ఇద్దరు స్నేహితులు స్థానికులకు విషయం తెలిపడం తో పోలీస్, ఫైర్ సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు ఆచూకీ లభించలేదు.
Similar News
News April 9, 2025
అమెరికా ఆధిపత్యాన్ని సహించం: చైనా

అమెరికా విధిస్తున్న భారీ సుంకాలపై చైనా మండిపడింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ఫిర్యాదు చేసింది. ‘భారీగా టారిఫ్స్ విధిస్తూ అమెరికా మాపై ఒత్తిడి పెంచుతోంది. ఈ ఆధిపత్య ధోరణిని మేం సహించబోం. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు చర్చలు జరిపితే మంచిది. లేదంటే మేం కూడా అలాగే వ్యవహరిస్తాం’ అని చైనా విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు. USపై విధించే టారిఫ్‌ను చైనా తాజాగా 84%కి పెంచడం తెలిసిందే.
News April 9, 2025
పార్వతీపురం: ఈనెల 14న అంబేడ్కర్ జయంతి

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 14న బీఆర్.అంబేడ్కర్ జయంతిని నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం మన్యం కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి జంక్షన్, మెయిన్ రోడ్డు వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలను వేసి నివాళులు అర్పిస్తారని తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో సమావేశం జరుగుతుందని చెప్పారు.
News April 9, 2025
MPలో విద్యార్థుల అటెండెన్స్.. ‘జై హింద్’ అనాలి

మధ్యప్రదేశ్‌లో విద్యార్థుల అటెండెన్స్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ‘ప్రజెంట్ సర్/మేడమ్’కు బదులుగా ‘జై హింద్’ అని చెప్పాలని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. క్యాబినెట్ మినిస్టర్ కున్వర్ విజయ్ షా కూడా దీనిపై ప్రకటన చేసినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. కాగా, హరియాణా ప్రభుత్వం కూడా విద్యార్థులు, టీచర్లు ‘గుడ్ మార్నింగ్’కు బదులుగా ‘జై హింద్’ చెప్పేలా చర్యలు తీసుకుంది.