News August 11, 2024

కాలువల్లో నీళ్లు వదలండి: హరీశ్‌రావు

image

రంగనాయక సాగర్‌కు మిడ్ మానేరు ద్వారా నీటి పంపింగ్ జరిగిందని, కాలువల్లో నీటి విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని MLA హరీశ్‌రావు ఇరిగేషన్ అధికారులను కోరారు. సిద్దిపేట ఇరిగేషన్ SE బస్వరాజ్, EE గోపాల కృష్ణతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం రంగనాయక సాగర్‌లో 2.3 TMCల నీరు ఉందని, 3TMCల పూర్తి సామర్థ్యం నీటిని నింపాలన్నారు.

Similar News

News February 7, 2026

మెదక్: ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల లెక్కింపు

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కలెక్టరేట్‌లో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో పోస్టల్ బ్యాలెట్, లెక్కింపు విధానంపై అవగాహన కల్పించారు. నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా జరుగుతుందన్నారు.

News February 7, 2026

మెదక్: జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

image

2026–28 కాలానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్డుల గడువు ఫిబ్రవరి 28తో ముగియనున్న నేపథ్యంలో అర్హత గల జర్నలిస్టులు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

News February 7, 2026

మెదక్: మున్సిపల్ బరిలో న్యాయవాది

image

మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో యువ న్యాయవాది జీవన్ రావు పోటీ చేస్తున్నారు. 2016లో లా పట్టా అందుకున్న జీవన్ రావు ప్రస్తుతం మెదక్ కోర్టులో ప్రాక్టీస్ నిర్వహిస్తున్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 7వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రావు సతీమణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి 6వ వార్డు రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.