News January 30, 2026
కాలుష్యాన్ని నివారించలేం.. నియంత్రించాలి: పవన్

AP: కాలుష్యం మన జీవితంలో అంతర్భాగమైందని DyCM పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొంతమేర పొల్యూషన్‌ను భరించకతప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. పూర్తిస్థాయిలో నివారించలేకున్నా నియంత్రించే ప్రయత్నం చేయాలని సూచించారు. పారిశ్రామికవాడల్లో ప్రత్యేక శ్రద్ధపెట్టాలని చెప్పారు. విశాఖ పరిధిలోని పరిశ్రమల యాజమాన్యాలతో ఆయన భేటీ అయ్యారు. పరిశ్రమలు 33% గ్రీన్ బెల్ట్ రూల్ పాటించాలని స్పష్టంచేశారు.
Similar News
News February 20, 2026
ఫిబ్రవరి 20: చరిత్రలో ఈ రోజు

1935: ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి జననం
1946: నటి, దర్శకురాలు విజయ నిర్మల జననం (ఫొటోలో)
1973: సంగీత దర్శకుడు టి.వి.రాజు మరణం
2010: నటుడు బి.పద్మనాభం మరణం
* ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
News February 20, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 20, 2026
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లే లక్ష్యం: మంత్రి

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ఇందులో భాగంగానే Ex IAS రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించినట్లు చెప్పారు. కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. CM CBN బీసీల పక్షపాతి అని తెలిపారు. గత ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో BC రిజర్వేషన్లను 24%కే పరిమితం చేసిందని విమర్శించారు.


