News February 9, 2025

కాలేశ్వరంలో నేటి కార్యక్రమాల వివరాలు

image

కాలేశ్వరంలో మహా కుంభాభిషేకం వైభవంగా సాగుతోంది. చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఇప్పటికే తుని తపోవన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు కాలేశ్వరానికి చేరుకున్నారు. ప్రాత: సూక్త మంత్ర పఠనం, ప్రాత:కాల పూజలు, రుద్రహవనం, జయాదులు, బలిప్రధానము, మహా పూర్ణాహుతి, ఉం.10:42 నిమిషాలకు మహా కుంభాభిషేకం, హారతి, మంత్ర పుష్పం, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వినియోగములు అనంతరం మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది.

Similar News

News February 9, 2025

నేడే రెండో వన్డే.. జట్టులో ఎన్ని మార్పులు?

image

IND, ENG మధ్య కటక్ వేదికగా ఇవాళ మ.1:30 నుంచి రెండో వన్డే జరగనుంది. కోహ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో జైస్వాల్‌ను తప్పిస్తారా? రోహిత్ ఫామ్‌లోకి వస్తాడా? వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కుతుందా? అతడి కోసం కుల్దీప్‌ను పక్కన పెడతారా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎలాగైనా గెలవాలని ENG కసిగా ఉంది. sports 18-2, hotstarలో లైవ్ చూడవచ్చు. WAY2NEWS లైవ్ స్కోర్ అప్‌డేట్స్ పొందవచ్చు.

News February 9, 2025

భద్రాద్రిలో దారుణం.. గర్భిణి ఆత్మహత్యాయత్నం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని రామాంజిగూడెంకు చెందిన మౌనిక అనే గర్భిణి కుటుంబ కలహాలతో శనివారం పురుగు మందు తాగి బలవన్మరణానికి యత్నించిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న భర్త మధు హుటాహుటిన ఆళ్లపల్లి ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు వివరించారు.

News February 9, 2025

సీట్ల తేడా ఎక్కువున్నా ఓట్ల వ్యత్యాసం తక్కువే!

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP, AAP మధ్య ఓట్ల తేడా 2% కంటే తక్కువే ఉంది. BJPకి 45.56% పోలవగా ఆప్‌కు 43.57% వచ్చాయి. కానీ సీట్ల తేడా మాత్రం 26 స్థానాలుగా ఉంది. కాషాయ పార్టీ 48 స్థానాలను గెలుచుకోగా ఆప్ 22 సీట్లకే పరిమితమైంది. అత్యధిక మెజార్టీతో గెలిచిన తొలి ముగ్గురు అభ్యర్థులూ ‘చీపురు’ పార్టీకి చెందినవారే కాగా అత్యల్ప మెజార్టీతో విజయం సాధించిన చివరి ముగ్గురూ కమలం అభ్యర్థులే కావడం గమనార్హం.

error: Content is protected !!