News March 4, 2025

కాల్వ శ్రీరాంపూర్: ఇంట్లో బంగారం చోరీ కలకలం

image

కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లి గ్రామానికి చెందిన మద్దెల కాంతమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో చోరీ కలకలం రేపుతోంది. తమ వీధిలో జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో బీరువా లాకరు ధ్వంసం చేసి 9 తులాల బంగారాన్ని గుర్తు తెలియని దుండగులు అపహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి ఎస్ఐ వెంకటేష్ చేరుకొని పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 30, 2025

NRPT: ప్రజా భద్రతే లక్ష్యం: ఎస్పీ

image

నేరాల నియంత్రణలో జిల్లా పోలీసులు సమర్థంగా పనిచేశారని ఎస్పీ డా. వినీత్ ఐపీఎస్ 2025 వార్షిక నివేదికలో వెల్లడించారు. జిల్లాలో గ్రేవ్ నేరాలు 22%, రేప్ & పోక్సో కేసులు 12.5% తగ్గాయని తెలిపారు. శాంతియుత ఎన్నికల నిర్వహణతో పాటు మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.

News December 30, 2025

ఇంటి వద్దే వేడుకలు చేసుకోండి: కలెక్టర్

image

నూతన సంవత్సర వేడుకలను సామాజిక బాధ్యతతో, సంయమనంతో జరుపుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వద్దే వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆమె నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంచి విలువలు ప్రతిబింబించేలా కొత్త ఏడాదిని స్వాగతించాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.

News December 30, 2025

పాలమూరు: సంపులో పడి 18 నెలల బాలుడి మృతి

image

మామిడి తోటలోని నీటి సంపులో పడి ఓ బాలుడి మృతి చెందిన విషాద ఘటన కల్వకుర్తి మండలం మాచర్లలో చోటుచేసుకుంది. వంగూరు మండలానికి చెందిన మల్లేష్, మంజుల దంపతులు మాచర్లలో మామిడి తోటను కౌలుకు తీసుకున్నారు. మంగళవారం పనుల నిమిత్తం తమ 18 నెలల కుమారుడు హర్షిత్‌ను తోటలోకి తీసుకెళ్లారు. ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.