News January 27, 2025
కాల్వ శ్రీరాంపూర్: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం సాయంత్రం కాల్వ శ్రీరాంపూర్ మండలంలో జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన పురుషోత్తం ప్రభాకర్ (45) తన భార్య పొలం పనికి రమ్మంటే రాలేదని గొడవపడ్డారు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. పురుషోత్తం మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 25, 2026
నక్కపల్లి: ఈ తాజమహల్‌కు లిమ్కా బుక్‌లో చోటు

సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేశ్ మరో అరుదైన ఘనత సాధించారు. 2026 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయనకు చోటు లభించింది. 4బీ పెన్సిల్ ముల్లుపై కేవలం 4 మి.మీ వెడల్పు, పొడవుతో అతి సూక్ష్మమైన తాజ్‌మహల్‌ను 6 గంటల పాటు శ్రమించి రూపొందించారు. నక్కపల్లి మండటం చినదొడ్డిగల్లుకు చెందిన వెంకటేశ్‌కు సంబంధించిన రికార్డు పత్రాన్ని మంగళవారం పోస్టల్ ద్వారా పంపారు.
News February 25, 2026
చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 25)

* 1961-తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మరణం * 1974-సినీ నటి దివ్యభారతి జననం(ఫొటోలో) * 1981-బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ పుట్టినరోజు * 1998-ఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానాన్ని ఆల్ ఇండియా రేడియో(ఆకాశవాణి) ప్రవేశపెట్టింది * 2004-సినీ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి మరణం * 2010-స్వాతంత్ర్య సమరయోధుడు కాటం లక్ష్మీనారాయణ మరణం * 1973- డైరెక్టర్ గౌతమ్ మేనన్ పుట్టినరోజు
News February 25, 2026
వలేటివారిపాలెం: జనార్ధన స్వామి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలు

వలేటివారిపాలెం – చుండి మధ్య 167బి జాతీయ రహదారి పక్కనే ఉన్న జనార్ధన స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి తవ్వకాలు చేపట్టారు. ఆలయ పక్కన ఉన్న మండపంలో సుమారు 10 అడుగుల లోతున గుంత తీయడం స్థానికంగా కలకలం రేపింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు రెండు మూడు సార్లు జరిగాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చారిత్రక దేవాలయాలను కాపాడాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.


