News January 29, 2025

కాల్వ శ్రీరాంపూర్: కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని తండ్రి ఆత్మహత్య

image

కాల్వ శ్రీరాంపూర్(M)లో ఓ వ్యక్తి మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలీలా.. మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన అడ్డగుంట సారంగం (55) అనే వ్యక్తి తన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదనే మనస్తాపంతో నిన్న సాయంత్రం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం మరణించినట్లు కొడుకు శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు.

Similar News

News November 14, 2025

రామగుండం: ఖాళీ ప్లాట్ల ఓనర్లకు అదనపు కలెక్టర్ వార్నింగ్

image

రామగుండం మున్సిపల్ పరిధిలో ఖాళీ ప్లాట్లు పిచ్చిచెట్లతో పెరిగి, మురుగు నీరు నిలిచి దోమలు- పందుల పెరుగుదలకు కారణమవుతున్నాయని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), నగర పాలక సంస్థ కమిషనర్ జె.అరుణశ్రీ అన్నారు. ఇలాంటి స్థలాలను గుర్తించి యాజమానులకు నోటీసులు జారీ చేస్తున్నామని, నోటీసు వచ్చిన వారం రోజుల్లో శుభ్రపరచని పక్షంలో మున్సిపాలిటీల చట్టం- 2019 ప్రకారం ఓనర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్: 56 మంది డిపాజిట్ గల్లంతు!

image

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS మధ్యే పోరు నడిచింది. కాగా మొత్తం 58 మంది ఈ ఎన్నికలో పోటీ చేయగా నవీన్ యాదవ్, మాగంటి సునీత మాత్రమే డిపాజిట్ దక్కించుకున్నారు. ఇందులో నవీన్ యాదవ్ గెలుపొందగా సునీత రెండో స్థానంలో నిలిచారు. BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సహా 56 మంది డిపాజిట్ గల్లంతైంది. చిన్న పార్టీలు, స్వతంత్రుల్లో ఒక్కరికి కూడా 250 ఓట్లు దాటలేదు.