News January 30, 2025

కాల్వ శ్రీరాంపూర్: విషపురుగు కుట్టి వ్యక్తి మృతి

image

కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బండి మధునయ్య విషపురుగు కుట్టి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామంలోని పాఠశాలలో పార్ట్ టైం స్వీపర్ గా పనిచేస్తున్న మధునయ్యను జనవరి 26న ఏదో విషపురుగు కుట్టింది. వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం చనిపోయాడు. మృతుడి కొడుకు బండి సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.

Similar News

News November 6, 2025

అసీమ్ మునీర్ నా భార్యను హింసిస్తున్నాడు: ఇమ్రాన్ ఖాన్

image

ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ పాక్ చరిత్రలోనే పెద్ద నియంత అని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ‘అతని మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అధికారం కోసం అతను దేనికైనా తెగిస్తాడు. నా భార్య బుష్రా బీబీని ఒంటరిగా ఉంచి మానసికంగా హింసిస్తున్నాడు. బానిసత్వం కంటే మేము చావునే కోరుకుంటాం. ఎప్పటికీ అతని ముందు తలవంచం. మమ్మల్ని మేము సరెండర్ చేయం’ అని తెలిపారు. కాగా 2023 AUG నుంచి ఇమ్రాన్ జైలులోనే ఉన్నారు.

News November 6, 2025

కృష్ణా: హవే విస్తరణపై ఎమ్మెల్యేల ముఖ్య సూచనలివే.!

image

VJA-MTM జాతీయ రహదారి నం.65 రహదారి విస్తరణపై బుధవారం విజయవాడలో అధికారులు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. NH-65 రహదారిని NH-16తో మూడు ప్రాంతాలలో అనుసంధానం చేయాలని ఎమ్మెల్యేలు అధికారులను కోరారు. రహదారి సమీప గ్రామాల్లో అండర్ పాస్‌ల నిర్మాణం, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజి వ్యవస్థ అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేలు సూచించారు.

News November 6, 2025

వరంగల్‌లో మల్టీ లెవల్ పార్కింగ్..!

image

వరంగల్ నగరంలో పార్కింగ్ సమస్యకు కుడా అధికారులు చెక్ పెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. భద్రకాళి ఆలయం ఎదురుగా ఉన్న 3 ఎకరాల స్థలంలో రూ.20 కోట్ల వ్యయంతో ఒకేసారి 600 కార్లను 5 ఫ్లోర్లలో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే HYD బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు సమీపంలో ఏర్పాటు చేశారు. అదే తరహాలో వరంగల్‌లో ఏర్పాటుకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(KUDA) అడుగులు వేస్తోంది.