News September 7, 2025
కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ‘మీకోసం’ కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు ప్రజలకు సూచించారు. ఈనెల 8న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని, లేదా 1100 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News September 7, 2025
వేటపాలెంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

వేటపాలెంలో ఆదివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. వేటపాలెం కొత్త కాలువ రైల్వే బ్రిడ్జి కింద నీటిలో పురుషుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి ఎస్సై జనార్ధన్‌కు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించిన ఎస్సై మృతుడి ఫొటోలను విడుదల చేశారు. అతని వివరాలు తెలిసిన వారు వేటపాలెం పోలీస్ స్టేషన్ లేదా చీరాల సర్కిల్ సీఐకి కానీ సమాచారం అందించాలని కోరారు.
News September 7, 2025
హైదరాబాద్‌కు ‘గోదావరి’.. రేపు సీఎం శంకుస్థాపన

TG: మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-2, 3లకు సీఎం రేవంత్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. రూ.7,360 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో మల్లన్నసాగర్ నుంచి నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు తరలించనున్నారు. జీహెచ్ఎంసీ, ORR పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీలకు తాగునీటి సరఫరాకు చేపట్టిన మరో ప్రాజెక్టును ఆయన ప్రారంభిస్తారు.
News September 7, 2025
HYD: పదేళ్లు కాంగ్రెస్‌ను అధికారంలో ఉంచేందుకు శ్రమిస్తున్నా: మహేశ్ కుమార్

పదేళ్ల తర్వాత పవర్‌లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని పదేళ్ల పాటు అధికారంలో ఉంచేందుకు శ్రమిస్తున్నానని MLC, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ HYDలో అన్నారు. KCRను గద్దె దించేందుకు ప్రత్యేక స్ట్రాటజీ అమలు చేశామని, CM రేవంత్ రెడ్డికి,తనకు కెమెస్ట్రీ బాగా కుదిరిందన్నారు. ఇద్దరి అభిప్రాయాలు ఏకీకృతమవుతున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని జోడెద్దుల్లా ముందుకు నడుపుతున్నామన్నారు.