News December 18, 2025

కాల సర్ప దోషం ఎలా ఏర్పడుతుంది?

image

జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య మిగిలిన 7 గ్రహాలు (రవి, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని) ఉంటే దానినే కాల సర్ప దోషం అంటారని పండితులు చెబుతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. మొత్తం 12 రకాల కాల సర్ప దోషాలు ఉంటాయట. ప్రతి దానికీ వేర్వేరు ప్రభావాలు, నివారణలు ఉన్నాయంటున్నారు. రాహుకేతువులు లగ్నం 1, 2, 7, 8వ స్థానాల్లో ఉంటే దోష ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వీటికి నివారణ మార్గాలున్నాయని వివరిస్తున్నారు.

Similar News

News December 22, 2025

GOOGLE MAP సాయంతో లూటీ… చివరకు ఏం జరిగిందంటే?

image

టెక్నాలజీ వాడుక ఇప్పుడు ఇళ్లలో లూటీలకూ పాకింది. గూగుల్ MAP స్ట్రీట్ వ్యూ ఫీచర్ సాయంతో ధనవంతుల ఇళ్లున్న ప్రాంతాలు, వాటిలోకి ఎలా చొరబడవచ్చో గుర్తించి ఓ ముఠా జంషెడ్‌పూర్‌లోని ఓ ఇంట్లో దొంగతనం చేసింది. అయితే పోలీసులు CCTV ఫుటేజీ, మొబైల్ ట్రాకింగ్‌ను కంబైనింగ్ చేసి పట్నాలో ఉన్న ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా పక్కరాష్ట్రాలకు పారిపోయేలా రూట్‌నూ ఎంచుకొని మరీ తమ నుంచి తప్పించుకొనేదని పోలీసులు తెలిపారు.

News December 22, 2025

అమీర్‌పేట్ గురించి ఈ విషయం మీకు తెలుసా?

image

HYD అమీర్‌పేట్ అంటే కోచింగ్ సెంటర్ల అడ్డా మాత్రమే కాదు.. లక్షలాది నిరుద్యోగుల ఆశల వారధి. 1900 కాలంలో ఆరో నిజాం తన జాగీర్దార్ అమీర్ అలీకి ఈ ప్రాంతాన్ని కానుకగా ఇచ్చారు. అప్పటి వేసవి రాజభవనమే నేటి నేచర్ క్యూర్ ఆసుపత్రి. రాజసం నిండిన ఈ గడ్డపై ఎందరో విద్యార్థులు నైపుణ్యం పెంచుకుని ప్రపంచస్థాయి కంపెనీలలో స్థిరపడ్డారు. ప్రతి విద్యార్థికి అమీర్‌పేట్ ఓ భావోద్వేగం. ఎంత ఎదిగినా ఈ చోటును ఎవరూ మర్చిపోలేరు.

News December 22, 2025

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీగా TIFFA సేవలు: మంత్రి సత్యకుమార్

image

APలోనే తొలిసారి 7 ప్రభుత్వ ఆస్పత్రుల్లో TIFFA స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి సత్యకుమార్ చెప్పారు. నర్సీపట్నం, తుని, నందిగామ ఏరియా ఆస్పత్రులు, ఒంగోలులోని MCH, పార్వతీపురం, తెనాలి, అనకాపల్లి జిల్లా ఆస్పత్రులకు అందించినట్లు చెప్పారు. ‘JAN 1 నుంచి ఉచిత సేవలు మొదలవుతాయి. ఈ స్కాన్‌తో 18-22 వారాల గర్భస్థ శిశువు లోపాలను కనుగొనవచ్చు. గర్భిణులకు ₹4K చొప్పున ఆదా అవుతుంది’ అని తెలిపారు.