News February 22, 2025
కాళేశ్వరంలో ఘనంగా సాగుతున్న పరిశుద్ధ్య పనులు

మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో మహాశివరాత్రికి ప్రత్యేక పరిశుద్ధ్య పనులు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. శనివారం పుష్కర ఘాట్ ఆవరణంలో అక్కడ ఉన్న చెత్త చదరంగం మొత్తం తీసి క్లీన్ చేసి దూరంగా పడేస్తున్నారు. దీంతో వీఐపీ ఘాట్ స్నానానికి వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంది.
Similar News
News October 26, 2025
గుంటూరులో నాన్ వెజ్ ధరలు ఇవే..!

గుంటూరులో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220, స్కిన్‌తో రూ. 200కి విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.900 వద్ద స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ.440, రాగండి రూ.170, బొచ్చ రూ.220గా ఉంది. చేపలను కొనుగోలు చేయడానికి నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News October 26, 2025
తుఫాన్: ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

AP: తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
* 27, 28 తేదీలు: తూ.గో, అన్నమయ్య, కడప జిల్లాలు
* 27, 28, 29 తేదీలు: ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాలు
> కోనసీమ జిల్లాలో వర్షాల తీవ్రతను బట్టి సెలవు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించారు. అటు మరిన్ని జిల్లాలకు హాలిడే ఇచ్చే అవకాశం ఉంది.
News October 26, 2025
పల్నాడులో చికెన్ ధరలివే

పల్నాడులో ఆదివారం చికెన్ ధర గత వారంతో పోలిస్తే నిలకడగా కొనసాగుతుంది. కార్తీక మాసం ప్రారంభమైనప్పటికీ చికెన్ రేట్లు తగ్గలేదని వినియోగదారులు చెబుతున్నారు. లైవ్ కోడి కేజీ రూ.126 పలుకుతోంది. స్కిన్‌తో కేజీ రూ.220 నుంచి రూ. 240, స్కిన్‌లెస్ రూ.230 నుంచి రూ.260కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.800 నుంచి రూ.900గా ఉంది. 100 కోడి గుడ్లు రూ.570కి అమ్ముతున్నారు. మరి ప్రాంతాల్లో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయి?


