News February 9, 2025

కాళేశ్వరంలో నేటి కార్యక్రమాల వివరాలు

image

కాళేశ్వరంలో మహా కుంభాభిషేకం వైభవంగా సాగుతోంది. చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఇప్పటికే తుని తపోవన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు కాళేశ్వరానికి చేరుకున్నారు. ప్రాత: సూక్త మంత్ర పఠనం, ప్రాత:కాల పూజలు, రుద్రహవనం, జయాదులు, బలిప్రధానము, మహా పూర్ణాహుతి, ఉం.10:42 నిమిషాలకు మహా కుంభాభిషేకం, హారతి, మంత్ర పుష్పం, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వినియోగములు అనంతరం మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది.

Similar News

News February 9, 2025

పోక్సో కేసులో విశాఖ సెంట్రల్ జైలుకు టీచర్‌: ఎస్ఐ

image

ఇటీవల వడ్డాదిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ గంగా ప్రసాద్‌పై <<15378554>>పోక్సో కేసు <<>>నమోదు చేసినట్లు బుచ్చయ్యపేట ఎస్ఐ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. చోడవరం కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారన్నారు. నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై హోం మంత్రి అనిత, ప్రజాసంఘాలు స్పందించిన విషయం తెలిసిందే.

News February 9, 2025

అనంత: చొక్కాపై పేర్లు రాసుకుని వ్యక్తి సూసైడ్

image

ఉరవకొండలోని చంగల వీధికి చెందిన కిశోర్(33) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు కొందరు వ్యక్తులు కారణం అంటూ వారి పేర్లను చొక్కాపై రాసుకున్నాడు.ఇంట్లో ఉరివేసుకున్న విషయం గమనించిన కుటుంబ సభ్యులు కిశోర్‌ను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

News February 9, 2025

దారుణం: ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం

image

AP: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. కంచికచర్ల మండలంలోని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఆమె న్యూడ్ ఫొటోలు తీసి మరో ఇద్దరు స్నేహితులకు పంపించాడు. వారు ఆ ఫొటోలతో బాధితురాలిని బెదిరించారు. దీంతో వేధింపులు తాళలేక పేరెంట్స్‌తో కలిసి బాధితురాలు కంచికచర్ల పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!