News February 15, 2026
కాళేశ్వరంలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలించిన ఎస్పీ

మహా శివరాత్రి సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఎస్పీ సంకీర్త్ పరిశీలించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున పోలీస్ బందోబస్తును మరింత పటిష్ఠంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పుష్కర ఘాట్, తెప్పోత్సవం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు.
Similar News
News February 16, 2026
జొన్నలో కాండం తొలుచు పురుగు.. నివారణ

జొన్న పంట వేసిన 35 రోజుల నుంచి కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఎకరానికి 4 కేజీల కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలను కాండం సుడుల్లో వేయాలి. * కత్తెర పురుగు లార్వా దశలో ఉంటే వేపనూనె(అజాడిరక్టిన్) 1500 పిపిఎం 5 ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. * పురుగు తీవ్రత అధికంగా ఉంటే క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 ML, ఒక లీటరు నీటికి కలిపి సుడుల్లో పడేలా పిచికారీ చేయాలి.
News February 16, 2026
జగిత్యాలలో కాంగ్రెస్ Vs కాంగ్రెస్.. జీవన్ రెడ్డికి ఎదురుదెబ్బ!

TG: జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ MLA సంజయ్-జీవన్ రెడ్డి మధ్య వర్గపోరు నడుస్తోంది. తమకే ఛైర్మన్ పీఠం కావాలంటే తమకే కావాలంటూ CONG అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే సంజయ్ క్యాంపునకు చెందిన వాణికి ఛైర్‌పర్సన్ పదవి దక్కినట్లు సమాచారం. మార్కెట్ కమిటీ పదవుల్లో అవకాశం ఇస్తామని జీవన్ రెడ్డికి నచ్చజెప్పారట. కాసేపట్లో క్లారిటీ రానుంది.
News February 16, 2026
పీరియడ్స్‌లో ఈ వ్యాయామాలు వద్దు!

పీరియడ్స్ సమయంలో వాకింగ్, స్విమ్మింగ్, యోగా వంటి తక్కువ ప్రభావ వ్యాయామాలు చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కానీ, అధిక బరువులు ఎత్తడం, రన్నింగ్, దూకడం, వంటి శరీరంపై అధిక ప్రభావం చూపించే వ్యాయామాలు చేయకూడదని సూచిస్తున్నారు. ముఖ్యంగా కార్డియో ఎక్సర్‌సైజ్, ఓవర్‌హెడ్ ఎక్సర్‌సైజ్, క్రంచెస్, స్క్వాట్స్ వంటివి చేయకూడదని సూచిస్తున్నారు.


