News April 6, 2025
కాళేశ్వరంలో 20 అడుగుల విగ్రహంతో వైభవం

కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో సరస్వతీ నది పుష్కరాలకు దేవాదాయశాఖ, ఇతర విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే రూ.25కోట్లు మంజూరు చేసింది. అలాగే ప్రధాన పుష్కర ఘాట్ వద్ద 20 అడుగుల ఎత్తులో సరస్వతి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. మహాబలిపురంలో ప్రత్యేకంగా తయారుచేయించి తెప్పిస్తున్నారు. మే 15న సూర్యోదయం నుంచి పుష్కరాలు ప్రారంభించేందుకు శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి ముహుర్తం నిర్ణయించారు.
Similar News
News April 7, 2025
రామగిరి హెలిప్యాడ్ వద్ద భద్రత సిబ్బంది తనిఖీలు

రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 8వ తేదీన పరామర్శించనున్నారు. ఉదయం 10.00 గంటలకు రామగిరి మండలం కుంటిమద్ది వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి బయలుదేరుతారు. ఈ నేపథ్యంలో మంగళవారం హెలిప్యాడ్ వద్ద భద్రత సిబ్బంది పరిశీలించారు.
News April 7, 2025
అనకాపల్లి: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 42 ఫిర్యాదులు

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 42 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఆస్తి తగదాలు, కుటుంబ కలహాలు, మోసపూరిత వ్యవహారాలపై ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఎస్పీ తుహీన్ సిన్హా స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు.
News April 7, 2025
కొందరు అధికారులే నిజమైన అంధులు.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం

TG: దివ్యాంగుల శాఖ అధికారుల తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంధులను కోర్టు చుట్టూ తిప్పడంపై మండిపడ్డారు. కొందరు అధికారులే నిజమైన అంధులని ఫైరయ్యారు. తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారంటూ 2017లో పలువురు అంధులు కోర్టును ఆశ్రయించారు. ఎనిమిదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. కాగా వీరి సమస్యను త్వరగా పరిష్కరించాలని జడ్జి అధికారులను ఆదేశించారు.