News February 5, 2025

కాళేశ్వరం కుంభాభిషేకం వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

image

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఆలయం లో ఈనేలా 7 నుంచి 09 వరకు జరిగే మహా కుంభాభిషేకం వాల్ పోస్టర్లను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ శ్రీధర్ వేరువేరుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణా రావు కార్యనిర్వహణాధికారి ఎస్. మహేశ్, ఉప ప్రధానార్చకులు పనకంటే ఫణింద్ర శర్మ పాల్గొన్నారు.

Similar News

News September 16, 2025

ప్రసారభారతిలో ఉద్యోగాలు

image

న్యూఢిల్లీలోని <>ప్రసార భారతి<<>> 50 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు ఉద్యోగ అనుభవం గల వారు ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/

News September 16, 2025

నిర్మల్ జిల్లా వర్షపాతం వివరాలు

image

గడిచిన 24 గంటలలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 397.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా నర్సాపూర్ మండలంలో 46.8, సోన్ 44, కడెం పెద్దూర్ 39.4, మామడ 30, దిలావర్పూర్ 32.4, బైంసా 28.2, ముధోల్ 19.6, లోకేశ్వరం 21.6, నిర్మల్ మండలాలలో 11.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు. రాబోయే 24 గంటల్లో జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

News September 16, 2025

డిగ్రీ విద్యార్థులకు అలర్ట్..రేపటితో ముగియనున్న గడువు

image

ఎన్టీఆర్: కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన యూజీ(హానర్స్) 8వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 17వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.800 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ పి.వీరబ్రహ్మచారి సూచించారు.