News February 16, 2025

కాళేశ్వరం: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పురస్కరించుకొని కాళేశ్వరం పుణ్య క్షేత్రానికి మంథని డిపో నుంచి మంథని-కాళేశ్వరానికి 26 బస్సులను నడిపించనున్నట్లు KNR RM బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీని బట్టి కరీంనగర్, గోదావరిఖని డిపోల నుంచి అదనపు బస్సులను నడిపిస్తామన్నారు. అలాగే వేలాల క్షేత్రానికి గోదావరిఖని డిపో నుంచి GDK-వేలాలకు 56 బస్సులు, మంథని డిపో నుంచి మంథని-వేలాలకు 40 బస్సులు నడిపిస్తామన్నారు.

Similar News

News September 19, 2025

RBSK తో చిన్నారులలో ముందస్తు గుర్తింపు.. సమగ్ర సంరక్షణ

image

పిల్లల ఆరోగ్య భద్రతకు PDPL జిల్లాలో RBSK కార్యక్రమం సమర్థంగా అమలవుతోంది. 18ఏళ్ల లోపు పిల్లల్లో 4D’s లోపాలు, వ్యాధులు, అభివృద్ధి లోపాల ముందస్తు గుర్తింపు, చికిత్స కోసం 10మొబైల్ హెల్త్ బృందాలు పనిచేస్తున్నాయి. లక్ష్యం 2,39,594లో 2,35,800 మందిని స్క్రీనింగ్ చేసి, 35,655 మందిలో వ్యాధులు గుర్తించారు. వీరిలో 29,118 మందికి తక్షణ చికిత్స అందించగా, 6,537 మందిని రిఫర్ చేశారు. అందులో 5,527 మంది కోలుకున్నారు.

News September 19, 2025

మోదీతో మంచి స్నేహం ఉంది: ట్రంప్

image

భారత్, PM మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మోదీతో మంచి స్నేహం ఉందని, ఆ కారణంగానే ఆయనకు నిన్న బర్త్ డే విషెస్ తెలిపానన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో ద్వైపాక్షిక భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. చమురు కొనుగోళ్లు ఆపేస్తేనే రష్యా దిగి వస్తుందని చెప్పారు. చైనా ఇప్పటికే అమెరికాకు భారీ టారిఫ్‌లు చెల్లిస్తోందని, మరిన్ని విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

News September 19, 2025

RG-3: యాజమాన్యం మొండి వైఖరి వల్లే సమావేశం బహిష్కరణ

image

సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి వల్లే స్ట్రక్చరల్ సమావేశాన్ని ఏఐటియుసి బహిష్కరించారని జనరల్ సెక్రటరీ కె.రాజ్ కుమార్ అన్నారు. గురువారం RG-3 ఏరియా OCP-2లో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లపై యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేయాలని, కార్మికులకు 35శాతం లాభాల వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైవీ రావు,MRC రెడ్డి తదితరులు పాల్గొన్నారు.