News July 9, 2024
కాళేశ్వరం: 14 మంది ఇంజినీర్లను విచారించిన జస్టిస్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. కాళేశ్వరంపై రిపోర్ట్‌ను కమిషన్‌కు కాగ్(CAG) అందజేసింది. ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్ ఫైనల్ రిపోర్టు ఇవ్వాలని మరోసారి కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. సోమవారం 14 మంది పంప్ హౌస్ ఇంజినీర్లను విచారించిన కమిషన్.. ఈనెల 16లోపు కమిషన్‌కు నివేదించిన సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో అందించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News May 7, 2025
KNR: జిల్లా స్పోర్ట్స్ స్కూల్ రాష్ట్రంలోనే మోడల్‌గా నిలవాలి: కలెక్టర్

కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. స్పోర్ట్స్ స్కూల్‌లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా ఉండేలా తీర్చిదిద్దాలని ఆమె సూచించారు.
News May 7, 2025
కరీంనగర్: రైతుల సంక్షేమం కోసమే భూభారతి: కలెక్టర్

రైతుల భూ సమస్యలు పరిష్కరించి,వారి సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ రైతువేదిక, కొత్తపల్లిలోని రైతువేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ధరణి చట్టంలో సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించలేదని, భూభారతి చట్టంలో మాత్రం పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు.
News May 7, 2025
కరీంనగర్ కొత్తపల్లి చెరువులో మృతదేహం

కరీంనగర్ కొత్తపల్లి చెరువులో గుర్తుతెలియని మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతుడు కొత్తపల్లికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.