News February 9, 2025
కాళేశ్వర క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్రణాళిక

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్రణాళిక రూపొందించి నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, MLA గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఆయన మాట్లాడుతూ.. కాశీ, కేదార్‌నాథ్ కంటే ఈ క్షేత్రం ప్రాశస్త్యం కలదిగా పురాణాలు చెబుతున్నాయన్నారు.
Similar News
News February 28, 2026
వర్కవుట్స్ అంటే చిరాకా? ఈ టిప్స్‌తో ఫిట్‌గా ఉండొచ్చు..!

జిమ్‌లో కష్టపడటం ఇష్టం లేనివారు ఫిట్‌గా ఉండేందుకు సింపుల్ టిప్స్ ఉన్నాయి. లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం ద్వారా డైలీ మూవ్‌మెంట్ పెంచాలి. నచ్చిన డాన్స్, స్విమ్మింగ్ వంటి పనులతో యాక్టివ్‌గా ఉంటూ రోజుకు 10వేల అడుగుల గోల్ పెట్టుకోవాలి. ఇంట్లోనే సింపుల్ పుష్-అప్స్, ఫ్రెండ్స్‌తో కలిసి వాకింగ్ చేస్తే బోర్ కొట్టదు. ప్రొటీన్, ఫైబర్ ఉన్న డైట్ తీసుకుంటే జిమ్‌కు వెళ్లకున్నా ఫిట్‌గా ఉండొచ్చు.
News February 28, 2026
అయితే ఆరిక, కాకుంటే కంది, దున్ని చల్లితే శనగ

వాతావరణం, నేల పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆరిక(చిరు ధాన్యాల) పంట బాగా పండుతుంది. ఒకవేళ పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా కంది పంట ఎలాగోలా పండుతుంది. భూమిని బాగా దున్ని, శ్రద్ధగా విత్తనాలు చల్లితే, శనగ పంట తప్పకుండా మంచి దిగుబడినిస్తుంది. ఈ సామెత ముఖ్యంగా వివిధ పంటలకు అవసరమైన శ్రమ, దిగుబడి, హామీ గురించి వివరిస్తుంది. శనగ పంటకు మంచి భూమి తయారీ, శ్రద్ధ అవసరమని చెబుతుంది.
News February 28, 2026
ఈ ‘1% రూల్’తో సంపదను పెంచుకోండి!

పర్సనల్ ఫైనాన్స్‌లో 1% రూల్ సంపదను పెంచే ఒక సింపుల్ స్ట్రాటజీ. దీని ప్రకారం నెలవారీ ఖర్చుల్లో కేవలం 1% తగ్గించుకోవాలి. లేదా మీ సేవింగ్స్‌ను 1% పెంచాలి. చిన్న ఖర్చులను అంటే అనవసర సబ్‌స్క్రిప్షన్లు లేదా అదనపు డైనింగ్ ఖర్చులను కట్ చేసి ఆ మొత్తాన్ని SIP వంటి వాటిలో ఆటోమేట్ చేయాలి. జపాన్ టెక్నిక్ కైజెన్ లాగా ఈ చిన్న మార్పులే లాంగ్ టర్మ్‌లో మీ మీద భారం పడకుండా భారీ సంపదను క్రియేట్ చేస్తాయి.


