News March 29, 2024

కావలికి చేరుకున్న చంద్రబాబు

image

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా కావలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి MLA అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, రూప్ కుమార్ యాదవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి బొకేలు అందజేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Similar News

News December 20, 2025

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్‌లో జరిగి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. నిమ్మ, వేరుశనగ, పాలు, మాంసం జిల్లాలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయని, వీటి నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలన్నారు.

News December 20, 2025

నెల్లూరు: వైసీపీలోనే ఆ ముగ్గురు..!

image

TDPకి షాక్ ఇచ్చిన నలుగురు కార్పోరేటర్లలో ముగ్గురు కార్పొరేటర్లు వైసీపీలోనే కొనసాగనున్నారు. మాజీ మంత్రి అనిల్‌ ఆధ్వర్యంలో మద్దినేని మస్తానమ్మ, కాయల సాహిత్య, వేనాటి శ్రీకాంత్‌రెడ్డిలు YS జగన్‌‌ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా శుక్రవారం సిటీ ఇన్‌ఛార్జ్ చంద్రశేఖర్‌రెడ్డిని సిటీ ఆఫీసులో కలిశారు. వైసీపీతోనే తమ పయనం సాగుతుందని TDPలో తమకు ఎటువంటి విలువ లేకుండా పోయిందని తెలిపారు.

News December 19, 2025

నెల్లూరు: కారుణ్య నియామక పత్రాలు అందజేత

image

విధి నిర్వహణలో ఉంటూ మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. జి. భాగ్యమ్మను ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో కుక్ గా, టి. పవన్ ను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ భరోసానిచ్చారు.