News February 12, 2025
కావలిలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739325901555_52112909-normal-WIFI.webp)
కావలి పట్టణ శివారు ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికపై గుండెమడకల రమేశ్ (45) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికులు కావలి వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. దీంతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 12, 2025
నెల్లూరు: టెన్త్ అర్హతతో 63 ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739280917913_673-normal-WIFI.webp)
టెన్త్ అర్హతతో నెల్లూరు డివిజన్‌లో 63 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీలోగా https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 12, 2025
మర్రిపాడు వద్ద హైవేపై ఘోర ప్రమాదం.. బాలుడి స్పాట్ డెడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739325124435_673-normal-WIFI.webp)
మర్రిపాడులోని నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై కస్తూర్బా గాంధీ కళాశాల సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నన్నోరుపల్లి గ్రామానికి చెందిన శివారెడ్డి(16) రోడ్డు దాటుతుండగా కారు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 12, 2025
నాయుడుపేటలో వ్యభిచార గృహంపై దాడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739320556580_673-normal-WIFI.webp)
నాయుడుపేట పట్టణంలోని టీచర్స్ కాలనీలో వ్యభిచార గృహం నడుస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. నెల్లూరు పట్టణానికి చెందిన ఓ మహిళ నాయుడుపేటలో ఓ ఇంటిని బాడుగకు తీసుకొని బయట ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.