News August 16, 2025

కావలిలో కిడ్నాపర్ పట్టివేత

image

తండ్రి అప్పు తీర్చలేదని కూతురిని వ్యాపారి కిడ్నాప్ చేశాడు. ప్రకాశం(D) చీమకుర్తి(M)కి చెందిన శ్రీనివాసరావు గతంలో బేల్దారి పనులకు తిరుపతి వెళ్లాడు. ఆ సమయంలో ఈశ్వర్ రెడ్డి నుంచి రూ.5లక్షలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదు. దీంతో శ్రీనివాసరావు కూతురిని ఈశ్వర్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు రంగంలోకి దిగి ఈశ్వర్‌రెడ్డిని కావలి వద్ద పట్టుకున్నారు.

Similar News

News August 16, 2025

ఉదయగిరి: దొంగలను పోలీసులుకు అప్పగించిన గ్రామస్థులు

image

ఉదయగిరి (M) కుర్రపల్లిలో మేకలు దొంగతనం చేసేందుకు యత్నించిన ముగ్గురిని గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గ్రామానికి చెందిన గోర్తుల వినోద్ కుమార్‌కు చెందిన మేకల దొడ్డిలో మేకలను దొంగలించేందుకు వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన ముగ్గురు దొంగలు ఆటోలో వచ్చారు. మేకలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా కుక్కలు అరవడంతో గ్రామస్థులు వారిని పట్టుకుని ఆటోతో సహా పోలీసులకు అప్పగించారు.

News August 16, 2025

నెల్లూరు: AMC పదవులకు రిజర్వేషన్లు ఇలా..!

image

నెల్లూరులో పలు వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్ పదవులకు కలెక్టర్ ఆనంద్ రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు రూరల్/అర్బన్ ఓసీ మహిళకు, కోవూరు ఎస్టీ జనరల్, కావలి ఓసీ మహిళకు ఖరారైంది. ఆత్మకూరు ఓసీ జనరల్, ఉదయగిరి బీసీ జనరల్, సర్వేపల్లి ఓసీ జనరల్, రాపూరు బీసీ మహిళ, కందుకూరు ఎస్సీ మహిళకు అవకాశం దక్కింది. త్వరలోనే ఛైర్మన్ల పేరు వెల్లడించనున్నారు.

News August 15, 2025

అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి : మంత్రి నారాయణ

image

స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్లను తయారు చేశామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో జాతీయ పతాకాన్ని అయన ఆవిష్కరించారు.