News September 3, 2025
కావలిలో దారుణం

కావలిలో చిన్నారిపై అత్యాచార యత్నం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కుటుంబం 3ఏళ్ల కిందట కావలి మండలానికి వలస వచ్చింది. వీరికి కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉంది. తల్లి కూరగాయల కోసం వెళ్లినప్పుడు బ్రహ్మయ్య(20) బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాలికకు రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News September 4, 2025
నెల్లూరు: రైతు బజారులో కిలో ఉల్లి రూ.16

నెల్లూరు జిల్లాలోని పలు రైతు బజార్లలో ఉల్లిపాయలను సబ్సీడీపై విక్రయిస్తున్నారు. పొదలకూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న రైతు బజారులో బుధవారం నుంచి కిలో రూ.16కు అందిస్తున్నట్లు నెల్లూరు మార్కెటింగ్ శాఖ ఏడీ అనితా కుమారి తెలిపారు. బయట మార్కెట్లో ఉల్లిపాయల ధర కిలో రూ.30గా ఉంది. సబ్సిడీపై రూ.16కే ఇస్తున్నామని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 4, 2025
నెల్లూరు పూర్వ కమిషనర్లపై అవినీతి ఆరోపణలు

నెల్లూరులో అపార్టుమెంట్లకు ఆక్యూపెన్సీ లేకుండానే మార్టిగేజ్(రుణాలు)లు రిలీజ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 72 అపార్ట్‌మెంట్లకు సంబంధించి పూర్వ కార్పొరేషన్ కమిషనర్లు హరిత, వికాస్ మర్మత్, చెన్నుడులు రూ.18 కోట్ల మేర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రస్తుత కమిషనర్ ఓ.నందన్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మరి.
News September 4, 2025
NLR: మిగిలిన బార్లకు నేటి నుంచి దరఖాస్తులు

నెల్లూరు జిల్లాలో మొదటి విడత ముగిసిన తర్వాత మిగిలిన బార్లకు నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆ తర్వాత నెల్లూరు కలెక్టరేట్‌లో లక్కీ డిప్ తీస్తారు. నెల్లూరు, కావలి, బుచ్చి, ఆత్మకూరు, అల్లూరు ప్రాంతాల్లో 31 బార్లకు అవకాశం ఉంది.