News January 2, 2025

కావలి: ఆశ్రయం కల్పిస్తే.. చంపేశాడు

image

కావలిలో ఓ మహిళ <<15037512>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. పోలీసుల కథనం.. కోల్‌కతాకు చెందిన అర్పిత బిస్వాస్(24) కుటుంబం కావలిలో ఓ చికిత్స కేంద్రం నిర్వహిస్తోంది. వారి బంధువు నయాన్ అనే యువకుడిని హెల్పర్‌గా పెట్టుకుని ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారు. అయితే నయాన్ యజమానిపై కన్నేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా అర్పితను ఒప్పించి ఇద్దరూ మద్యం తాగారు. మత్తులోకి జారుకోగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News January 4, 2025

కోరిక తీర్చనందుకే మహిళ హత్య: కావలి DSP

image

కావలిలో ఈ నెల ఒకటో తేదీన అర్పిత బిస్వాస్ అనే మహిళను హత్య చేసిన నౌమౌన్ బిస్వాస్‌ను అరెస్ట్ చేసినట్లు DSP శ్రీధర్ తెలిపారు. అర్పితను అనుభవించాలనే కోరికతో నిందితుడు ఆమె భర్త శ్రీకాంత్‌తో కలిసి మందు తాగాడు. శ్రీకాంత్ మత్తులోకి జారుకున్నాక.. పక్క గదిలో నిద్రిస్తున్న అర్పితపై లౌంగిక దాడికి యత్నించాడు. ఆమె అడ్డుకోవడంతో రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం చనిపోయిన అర్పితను అత్యాచారం చేసినట్లు ఆయన తెలిపారు. 

News January 4, 2025

దగదర్తి ఎయిర్‌పోర్టుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

image

దగదర్తిలో విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందని CM చంద్రబాబు ప్రకటించారు. గతంలో జిల్లాలో దగదర్తి విమానాశ్రయాన్ని 1379 ఎకరాల్లో నిర్మించాలని కార్యాచరణను రూపొందించి 635 ఎకరాలను సేకరించారు. మిగిలిన 745 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈప్రాంతంలో BPCL చమురుశుద్ధి కార్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీసిటీ సెజ్‌లో ఎయిర్ స్ట్రిప్‌ను తేవాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు.

News January 4, 2025

ఎక్కడి వారు అక్కడే పనిచేయాలి: డీఎంహెచ్ఓ

image

వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కడ పనిచేయాల్సిన వారు అక్కడే పని చేయాలని నెల్లూరు డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డిప్యూటేషన్లపై విధులు నిర్వర్తిస్తున్న వారిని వెంటనే రిలీవ్ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. జీవో నం. 143 ద్వారా డిప్యూటేషన్‌పై ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని వెల్లడించారు.