News March 22, 2026
కావలి: ఆ బోట్ల విడుదల వెనకున్న నేత ఎవరు..?

కొన్ని నెలల నుంచి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ఉన్న ఆ బోట్లను విడిపించడంలో కీలకంగా వ్యవహరించిన నేత ఎవరు? ఆయనకు దాని వలన వచ్చే లాభం ఏమిటనేది ప్రస్తుతం జిల్లాలో ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో ఎంపీ బీద మస్తాన్ రావు వీడియో షేర్ చేసి క్లారిటీ ఇవ్వగా.. ఇంత గొడవ జరిగినా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పందించలేదని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల తీర ప్రాంత సమస్య కావడంతో ఈ విషయం సమస్యాత్మకంగా మారుతోంది.
Similar News
News April 20, 2026
బసవేశ్వరుడికి నెల్లూరు కలెక్టర్ నివాళులు

నెల్లూరు కలెక్టరేట్లో మహాత్మా బసవేశ్వర జయంతి సోమవారం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్ తదితరులు బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బసవేశ్వర గొప్ప సామాజిక సంస్కర్త, తత్వవేత్త, కవి అన్నారు. కుల, లింగ వివక్షతను వ్యతిరేకిస్తూ సమసమాజ నిర్మాణం కోసం కృషి చేశారని కొనియాడారు.
News April 20, 2026
ఫలించిన నెల్లూరు కలెక్టర్ ప్రయత్నం

నెల్లూరు ఇన్ఛార్జ్ DPO వసుమతికి ఇటీవలే సీఈవోగా ప్రమోషన్ లభించింది. ఆ తర్వాత ఆమెను తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. నెల్లూరు జిల్లాలోనే ఆమెకు బాధ్యతలు ఇవ్వాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆ శాఖ రాష్ట్ర కమిషనర్‌కు లేఖ రాశారు. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆమెను నెల్లూరు జిల్లా స్వర్ణ గ్రామ/వార్డు అధికారిణిగా నియమించారు.
News April 20, 2026
BREAKING: నెల్లూరులో ఘోర ప్రమాదం

నెల్లూరు సిటీలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ముత్తుకూరు రోడ్డు వడ్డిపాలెం సమీపంలో స్కూటీని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు చక్రాల కింద పడటంతో స్పాట్లోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్కూటీ నంబర్ AP40KK6649 ఆధారంగా మృతుల వివరాలు సేకరిస్తున్నారు.


