News March 9, 2026

కావలి: చదివింది 5th.. రూ.150 కోట్లకు కుచ్చుటోపి.!

image

చదివింది 5th. రియల్ ఎస్టేట్‌లో అంచెలంచెలుగా ఎదిగి HYDలో త్రిపుర కన్‌స్ట్రక్షన్ ప్రారంభించాడు. ప్రజల నుంచి ప్లాట్ల పేరుతో భారీగా వసూలు చేశాడు. ఎన్నికల్లో జనసేన నుంచి పోటీచేసి దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేసినా డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయాడు కావలికి చెందిన పసుపులేటి సుధాకర్. ప్రజలు నిలదీయడంతో ఆయన బండారం బయటపడింది. అపార్ట్‌మెంట్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు.

Similar News

News April 5, 2026

నెల్లూరు జిల్లాలో వారసులు ఎంట్రీ ఇస్తారా…?

image

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తన తమ్ముడు గిరిధర్ రెడ్డి బరిలో ఉంటారని MLA శ్రీధర్ రెడ్డి చెబుతున్నారు. మహిళకు రిజర్వ్ అయితే తన కుమార్తె లక్ష్మీహైందవి, వైష్ణవి, గిరిధర్ కుమార్తె సాయి శశిర రెడ్డిలో ఒకరికి టికెట్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారంట. గత ఎన్నికల్లో ప్రచారం చేసిన మంత్రులు ఆనం, నారాయణ కుమార్తెలు కైవల్య, షరిణి, సోమిరెడ్డి కోడలు శ్రుతిరెడ్డి సైతం బరిలో ఉంటారని ఉహాగానాలు మొదలయ్యాయి.

News April 5, 2026

నెల్లూరు: ఇంటర్న్‌షిప్.. నెలకు రూ.15 వేలు

image

నెల్లూరు జిల్లాలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ ఫేజ్-3కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపికైన వారికి రూ.9వేలు, స్టైపెండ్, రూ.6వేలు గ్రాంట్, ఇంటర్న్‌షిప్ పూర్తయ్యాక సర్టిఫికెట్ అందజేస్తారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివి వయసు 18-25 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు అర్హులు. ఏప్రిల్ 15వ తేదీ లోపు pminternship.mygov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

News April 5, 2026

HYDలో నెల్లూరు జిల్లా యువకుడి మృతి

image

హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదంలో నెల్లూరు జిల్లా యువకుడు చనిపోయాడు. కావలికి చెందిన పసుపులేటి పెంచాల దేశిత్(25) HYDలోని హఫీజ్‌పేట్ వద్ద ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఫ్రెండ్‌తో కలిసి బైకుపై శనివారం అల్విన్ కాలనీ వైపు బయల్దేరాడు. బైకును వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దేశిత్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. అతని ఫ్రెండ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.