News July 14, 2024
కావలి: పెళ్లి కాలేదని వ్యక్తి ఆత్మహత్య

మూడు పదుల వయస్సు దాటినా పెళ్లి కాలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కావలి పట్టణం కలుగోళమ్మపేటలో జరిగింది. పసుమర్తి శ్రీనివాసులు (32) అనే వ్యక్తి ఎన్ని సంబంధాలు చూసినా వివాహం జరగడం లేదన్న మనస్తాపంతో ఎలుకల మందు తిని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చెన్నైలో మూడు రోజులుగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
Similar News
News November 3, 2025
సోమిరెడ్డి అక్రమ వసూళ్లను ప్రశ్నిస్తే తప్పా: కాకాణి

సోమిరెడ్డి అక్రమ వసూళ్లను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వెంకటాచలం మండలానికి చెందిన వైసీపీ నేత గోపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉండగా అతడిని పరామర్శించారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న గోపాల్ దంపతులపై విచక్షణరహితంగా దాడి చేసి, గోపాల్ గొంతు కోశారని కాకాణి ఆరోపించారు. సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నించినందుకే టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన అన్నారు.
News November 3, 2025
నెల్లూరు జైలుకు జోగి రమేష్ తరలింపు

నకిలీ మద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రామును నెల్లూరు జైలుకు తరలించనున్నారు. జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో వారిని నెల్లూరుకు తీసుకురానున్నారు. ఓ పక్క జోగి రమేష్ అరెస్టు అన్యాయమని, అక్రమమని వైసీపీ నేతలు నిరసన చేపడుతున్నారు.
News November 3, 2025
ఒకే రోజు ఐదుగురు గల్లంతు.. నలుగురి మృతి

జిల్లాలో ఆదివారం విషాదం నెలకొంది. ఇందుకూరుపేట(M) మైపాడు బీచ్‌లో ముగ్గురు <<18178820>>ఇంటర్ విద్యార్థులు<<>> మృతి చెందగా, <<18180051>>కావలి(M) <<>>తుమ్మలపెంటలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవలో నుంచి కిందపడి మరొకరు మృతి చెందారు. మరోవైపు ఆత్మకూరు పట్టణ సమీపంలోని చెరువులో సాయంత్రం నలిశెట్టి <<18180051>>మహేష్<<>> గల్లంతయ్యాడు. చెరువులో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు.


