News July 21, 2024
కావలి వద్ద నాగన్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు

సిలిగాట్ నుంచి తాంబరం వెళ్తున్న నాగన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించిన ఘటన కావలి సమీపంలో చోటుచేసుకుంది. రైల్లోని జనరల్ బోగీలో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు రైలును నిలిపివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో రైల్వే అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News February 6, 2026
నెల్లూరు: మితిమీరుతున్న గంజాయి అరాచకాలు!

గంజాయి పేరు వింటేనే నెల్లూరు జిల్లా ఉలిక్కిపడుతుంది. ఇందుకు నెల్లూరు కల్లూరు పల్లిలో ఉద్యమకారుడి దారుణ హత్య, కోవూరులో మైనర్ బాలికపై హత్యాయత్నం వంటి ఘటనలే ఉదాహరణ. జిల్లాలో ఏదో ఒకచోట నిత్యం గంజాయి పట్టుబడుతూనే ఉంది. రోడ్లపై కత్తులతో హల్‌చల్ వంటి ఘటనలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పోలీసులు నామమాత్రంగా తనిఖీలు చేపడుతున్నారని విమర్శలు ఉన్నాయి. వీటి మూలాలను పూర్తిగా నాశనం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
News February 6, 2026
తత్కాల్ ఫీజు చెల్లింపునకు 12 వరకు అవకాశం

పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజును చెల్లించేందుకు ఈ నెల 12 వరకు గడువుందని డీఈఓ బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. తత్కాల్ ఫీజు కింద రూ.వెయ్యి అపరాధ రుసుమును చెల్లించాలని కోరారు. అదే తేదీలోపు అన్ని డాక్యుమెంట్లతో నామినల్ రోల్స్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. వివరాలకు bse.ap.gov.in లేదా దర్గామిట్ట జడ్పీ స్కూల్లో గల జిల్లా పరీక్షల విభాగాన్ని సంప్రదించాలని కోరారు.
News February 6, 2026
నెల్లూరు: తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న

తండ్రి స్థానంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ అన్న తన తమ్ముడి భార్య పైనే కన్నేశాడు. ప్రశ్నించిన తమ్ముడిని చితకబాదాడు. చివరకు తల్లి ఫిర్యాదుతో జైలు పాలయ్యాడు. నెల్లూరు రూరల్ సీఐ గుంజి వేణు వివరాల మేరకు.. పెనుబర్తి ఎస్టీ కాలనీలో నివాసముండే శ్రీనివాసులు తన తమ్ముడి భార్యపై మోజులోపడి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. దీంతో శ్రీనివాసులును గురువారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.


