News April 25, 2024
కావలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకి తరలించారు. చెన్నై నుంచి కొయ్యలగూడెంకు వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. మృతులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన జ్యోతి కళ్యాణి, రాజీ, కుమార్‌లుగా గుర్తించారు.
Similar News
News March 1, 2026
రేపు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను ఈ సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్‌సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు.
News March 1, 2026
నెల్లూరు: నో రిస్క్.. గెలిచిన వారినే కొంటాం.!

జిల్లాలో 722 పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి నాయకులు కొత్త పంథాను అవలంభిస్తున్నారట. గెలిచిన వారినే కోనేందుకు MLAలు సిద్ధమవుతున్నారట. అభ్యర్థులకు పార్టీ ఫండ్, వ్యక్తి గత డబ్బులు ఏమీ ఇవ్వమని నాయకులు తెగేసి చెబుతున్నారంట. దీంతో సర్పంచి, కార్పొరేటర్లు సొంత ఖర్చులు భరించాలంటే భారంగా మారుతోంది. స్థానిక ఎన్నికల్లో బలాబలాలు తేల్చుకోవడం సులువు కాకపోవడంతో MLAలు డబ్బు ఖర్చు చేసేందుకు జంకుతున్నారట.
News March 1, 2026
నెల్లూరు గృహ నిర్మాణ శాఖ ఈఈ బదిలీ

గృహ నిర్మాణ శాఖ సంస్థ నెల్లూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎంవీ మోహన్ రావు బదిలీ అయ్యారు. ఈ మేరకు సంబంధిత శాఖ నుంచి శనివారం ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఆయనను కొత్తగా ఏర్పడ్డ మార్కాపురం జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. కాగా మోహన్ రావు స్థానంలో ఇక్కడ ఎవరినీ నియమించలేదు.


