News June 24, 2024

కాశినాయన మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు

image

జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం వరకు కురిసిన వర్షానికి కాశినాయన మండలంలో అత్యధిక వర్షపాతం నమోదయింది. కాశినాయన మండల పరిధిలో 7.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, బద్వేలు మండలంలో 1.6 మి.మీ., రాజుపాలెం మండల పరిధిలో 1.2 మి.మీ., వర్షపాతం నమోదయింది. జిల్లా వ్యాప్తంగా 9.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా సరాసరి 0.3 గా నమోదయింది.

Similar News

News October 5, 2024

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

image

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనను నియమించడం పట్ల రాచమల్లు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

News October 5, 2024

కడప జిల్లాలో 83 వీఆర్వోలు బదిలీ

image

కడప జిల్లాలో పలువురు వీఆర్వోలను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్ 1, 2 విలేజ్ రెవెన్యూ అధికారులు 83 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా 48 మందిని బదిలీ చేశారు. అనంతరం 15, 6, 12, 2 ఇలా వరుసగా 5 ఉత్తర్వులు విడుదల చేశారు. వీళ్లందరిని కొందరిని కడప జిల్లాలోని పోస్టింగ్‌‌లు ఇవ్వగా మరికొందరిని అన్నమయ్య జిల్లాకు బదిలీ చేశారు.

News October 5, 2024

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి 6 నుంచి దసరా సెలవులు

image

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు, ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. తిరిగి క్లాసులు ఈనెల 14 నుంచి పునః ప్రారంభమవుతాయని చెప్పారు.