News March 3, 2025
కాశీకి వెళ్లి మురిమడుగు మహిళా మృతి

ఉత్తరప్రదేశ్లోని కాశీ పుణ్యక్షేత్రం దర్శనానికి వెళ్లి జన్నారం మండలంలోని మురిమడుగు మహిళ బోర్లకుంట రాజవ్వ మృతి చెందింది. 11 రోజుల క్రితం రాజవ్వ కుంభమేళాలో భాగంగా కాశీకి వెళ్లి శివున్ని దర్శించుకుంది. అనంతరం రాజవ్వ హఠాత్తుగా పడిపోవడంతో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆదివారం మణికర్ణిక ఘాట్‌లో రాజవ్వ పార్థివ దేహానికి అంత్యక్రియలు చేశారు.
Similar News
News February 28, 2026
ఏన్కూర్‌లో ఎంపీపీఎస్ హెచ్‌ఎమ్ సస్పెండ్

ఏన్కూర్ ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయురాలు బుగ్గినేని జయను సస్పెండ్ చేశారు. ఈసీఆర్ కార్యక్రమం అమలులో లోపాలు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి బోధన విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు. సస్పెన్షన్ ఉత్తర్వులను మండల విద్యాధికారి నాగిరెడ్డి అందజేశారు.
News February 28, 2026
దెందుకూరు జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడిపై విచారణ

మధిర మండలం ZPHS దెందుకూరులో తెలుగు ఉపాధ్యాయుడు స్వర్గం శ్రీనివాసరావుపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. విద్యార్థినుల పట్ల ఆయన అనుచితంగా ప్రవర్థించాడని వారి తల్లిదండ్రులు ఆరోపించారు. మండల విద్యాశాఖాధికారి ప్రభాకర్‌ను ఎంక్వయిరీ అధికారిగా నియమించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిని కూడా విచారణ బృందంలో చేర్చారు.
News February 28, 2026
కేజ్రీవాల్ రీఎంట్రీ.. కాంగ్రెస్‌కు కష్టకాలమేనా?

కోర్టు క్లీన్ చిట్‌తో <<19251338>>కేజ్రీవాల్<<>>కు రాజకీయంగా కొత్త ఊపిరి లభించింది. పంజాబ్, గుజరాత్, గోవా వంటి రాష్ట్రాల్లో AAP పుంజుకునే అవకాశం ఉంది. ఇది నేరుగా కాంగ్రెస్ ఓటు బ్యాంకునే దెబ్బతీసే ప్రమాదం ఉంది. అటు INDIA కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వానికి కేజ్రీవాల్ సవాల్‌గా మారే అవకాశం లేకపోలేదు. కేజ్రీవాల్ ‘సెకండ్ ఇన్నింగ్స్’తో విపక్ష కూటమిలో కాంగ్రెస్ పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా.


