News August 6, 2024
కాశీలో బాన్సువాడకు చెందిన భక్తురాలి మృతి
కాశీ దర్శనానికి వెళ్లిన బాన్సువాడకు చెందిన భక్తురాలు మంగళవారం మృతి చెందారు. బాన్సువాడ పట్టణంలోని దివంగత కందగట్ల రాజమౌళి సతీమణి సరోజనమ్మ ఇటీవల భక్తులతో కలిసి కాశీ పుణ్యక్షేత్రం వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆమె అక్కడ గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల భక్తులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కాగా గత 6 నెలల క్రితం కూడా బాన్సువాడకు చెందిన రమేష్ అనే భక్తుడు కాశీలో మృతి చెందిన సంగతి తెలిసిందే.
Similar News
News January 23, 2025
నవీపేటలో బోల్తా పడిన స్కూల్ బస్సు
మండలంలోని కమలాపూర్ గ్రామంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. నవీపేటకు చెందిన స్కూల్ బస్సు గురువారం ఉదయం పిల్లలను నాడాపూర్‌లో ఎక్కించుకొని వెళుతుండగా కమలాపూర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. కాగా బస్సులో ఉన్న విద్యార్థులు సురక్షితంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
News January 23, 2025
రామారెడ్డి: హత్య కేసులో ఐదుగురు అరెస్ట్
హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు KMR అదనపు SP చైతన్య రెడ్డి తెలిపారు. రామారెడ్డి మండలం అన్నారానికి చెందిన పొక్కిలి రవి(41)ని అతడి అన్న కిష్టయ్యా ఈనెల 19న హత్య చేయించాడు. వారి మధ్య భూతగాదాలు ఉండటంతో కిష్టయ్య, అతడి భార్య సత్తవ్వ, కుమారుడు కిషన్ కలిసి షేక్ అఫీజ్, నరేశ్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించారు. కేసు నమోదు చేసిన రామారెడ్డి SI నరేష్ వారిని అరెస్టు చేశారు.
News January 23, 2025
NZB: కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ శివారులోని నాగారం తెలంగాణ మైనార్టీ జూనియర్ కళాశాల బాలుర-1లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థులు నేరుగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ సయ్యద్ హైదర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులలో ప్రవేశాల కోసం ప్రస్తుతం10వ తరగతి చదువుతున్న ముస్లీం, క్రిస్టియన్, సిక్కు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.