News November 14, 2024

కాసిపేట మండలాన్ని విడిచి వెళ్లిన పెద్దపులి

image

మంచిర్యాల జిల్లా కాసీపేట మండలం ముత్యంపల్లి సెక్షన్ పరిధిలోని పెద్దధర్మారం, గురువాపూర్, చింతగూడ, మలికేపల్లి, వెంకటాపూర్ శివారులో గత 10రోజులుగా సంచరించిన పెద్దపులి తీర్యాని అడవుల్లోకి తరలి వెళ్లినట్లుగా అటవి శాఖ అధికారులు తెలిపారు. అధికారులు మాట్లాడుతూ..తీర్యాని మండలం ఏదులాపూర్ అటవీ శివారులో పులి పాద ముద్రలను అక్కడి అధికారులు కనుగొన్నట్లు వివరించారు.

Similar News

News December 30, 2025

ఆదిలాబాద్: చైనా మంజా.. 5 కేసులు: ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లాలో చైనా మంజాపై పూర్తిగా నిషేధం విధించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా చైనా మంజాను విక్రయించినా, వినియోగించినా, దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు వన్ టౌన్‌లో 5 కేసులు నమోదు చేశామన్నారు. ఎవరైనా చైనా మంజా విక్రయిస్తే సమాచారం అందించాలని కోరారు.

News December 30, 2025

ఆదిలాబాద్: 2025లో పోలీసుల అద్భుత ఫలితాలు

image

2025లో పోలీసులు అద్భుత ఫలితాలు సాధించారు. గతేడాది 20గా ఉన్న నేరస్తుల శిక్షల సంఖ్య ఈసారి 51కి పెరిగింది. CEIR ద్వారా 718 ఫోన్లను రికవరీ చేశారు. షీ టీమ్స్, పోలీస్ అక్క కార్యక్రమాలతో మహిళల భద్రతకు పెద్దపీట వేశారు. డ్రగ్స్, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడం, ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ ద్వారా ప్రజలకు చేరువయ్యారు. హత్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడమని ఎస్పీ వెల్లడించారు.

News December 29, 2025

38 ఫిర్యాదులు నమోదు: ADB ఎస్పీ

image

సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 38 దరఖాస్తులు వచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వాటి పరిష్కారానికి సంబంధించిన అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఆయనతో పాటు శిక్షణ ఐపీఎస్ రాహుల్ పంత్, సీసీ కొండరాజు, కవిత, వామన్ ఉన్నారు.