News October 10, 2025
కాసీపేట: కుళ్ళిపోయిన స్థితిలో గుర్తుతెలియని మృతదేహం

కాసీపేట మండలం పెద్దనపల్లి నాయకపుగూడ గ్రామ శివారు శుద్ధ వాగుఒడ్డులో కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి (40) గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై ఆంజనేయులు చెప్పారు. గత 5రోజుల రోజుల క్రితం నీళ్లలో పడిపోయి చనిపోయి ఉండవచ్చని అనుమానించారు. కాసీపేట, బెల్లంపల్లి మండలాల గ్రామాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా కనబడకపోయినట్లయితే చూసి నిర్ధారణ చేసుకోవాలన్నారు.
Similar News
News October 10, 2025
Political Trend: జూబ్లీహిల్స్ BJP అభ్యర్థిగా BRS!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగిట సిటీ పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. BJP అభ్యర్థి INC నుంచి పోటీ చేస్తాడని BRS నేతలు సెటైర్లు వేశారు. కౌంటర్‌గా BJP అభ్యర్థి కూడా BRS నుంచేనని TPCC లీడర్ సామ రామ్మోహన్ ట్వీట్ చేశారు. ‘కారు గుర్తుకు ఓటు కమల బలోపేతం కోసం.. BJP కార్యకర్తలు, BRS మైనారిటీ నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే BRS-INC ఒక్కటే అని BJP ఆరోపిస్తోంది.
News October 10, 2025
ADB: పిల్లల ఆరోగ్యానికి వెరీ ‘గుడ్డు’

జీవితంలో రోజుకో గుడ్డు ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతారు. పిల్లల ఎత్తు, బలం, మెదడు అభివృద్ధికి గడ్డు చాలా అవసరం. పేదరికం, పోషకాహార లోపం ఉన్న కుటుంబాలకు గడ్డు ఆర్థికంగా అందుబాటులో ఉండే ఉత్తమ ఆహారం. అంగన్వాడీలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్స్‌లో విద్యార్థులకు గుడ్లు ఆహారంలో చేరుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 250+హాస్టళ్లలో 40,000 మందికి గుడ్లు అందిస్తున్నారు.
#నేడు వరల్డ్ ఎగ్ డే
News October 10, 2025
బ్రహ్మోత్సవాల పనితీరుపై సమావేశం

9 రోజుల పాటు వైభవంగా సాగిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల పనితీరుపై తిరుపతి మహతి ఆడిటోరియంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. TTD, పోలీసులలోని వివిధ విభాగల పనితీరు, ఎదుర్కొన్న సమస్యలపై సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చేయడానికి అవకాశం కలుగుతుందని SP సుబ్బారాయుడు, TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ సూచించారు. JEO వీరబ్రహ్మం, డీఎఫ్వో ఫణి కుమార్ పాల్గొన్నారు.