News November 20, 2025
కాసేపట్లో GHMC స్టాండింగ్ కమిటీ మీటింగ్..!

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన కాసేపట్లో స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. నగర పరిపాలనకు కీలకమైన ఈ సమావేశంలో సుమారు 20 ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. రోడ్లు, పారిశుద్ధ్య చర్యలు, డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక వసతుల అభివృద్ధి, పౌర సేవల మెరుగుదల వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
Similar News
News November 23, 2025
ఆర్టీసీలో ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు: ఆది

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళలు ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం వట్టెంలలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని అన్నారు. అవసరమైన వారికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామన్నారు.
News November 23, 2025
పురుషార్థాలు సిద్ధింపజేసే విష్ణు శ్లోకం

యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ||
విష్ణు సహస్ర నామాలు ముఖ్యమైనవి మాత్రమే కాదు. ఇవి అసాధారణమైనవి. ఎందరో రుషులు వీటిని గానం చేశారు. కీర్తించారు. అంతటి మహిమాన్విత నామాలను పఠించడం లేదా వినడం వల్ల పరమ ప్రయోజనాలు, పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇవి లోకానికి శుభాన్ని, భగవంతుని అనుగ్రహాన్ని చేకూర్చడానికి ఉపక్రమిస్తున్నాయి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 23, 2025
యథావిధిగా అమలాపురంలో ‘పీజీఆర్‌ఎస్’ : కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈ నెల 24 సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో, అలాగే ఆర్డీవో కార్యాలయాలు, మండల స్థాయిలో ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కలెక్టర్ కోరారు.


