News December 1, 2025
కిచెన్ టిప్స్.. మీ కోసం..

* సొరకాయ మిగిలిపోయినపుడు కుళ్లిపోకుండా ఉండాలంటే.. ఆ వైపును అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టాలి.
* గాజు గ్లాసులను తరలించేటప్పుడు వాటికి కాటన్ క్లాత్/ సాక్స్‌లు తొడిగితే ఒకదానికొకటి తగిలినా పగలవు.
* కేక్ మిశ్రమంలో టీ స్పూన్ గ్లిజరిన్ కలిపితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
* వాటర్ బాటిల్‌ను వాడకుండా ఉంచితే దుర్వాసన వస్తుంది. ఇలా జరగకూడదంటే అందులో యాలకులు/లవంగాలు/ దాల్చిన చెక్క ముక్క వేసి ఉంచండి.
Similar News
News March 6, 2026
ఉగాది తర్వాత లోకేశ్ సీఎం.. పేర్ని నాని సంచలన కామెంట్స్

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగాది తర్వాత లోకేశ్ సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు. ఇదే అంశంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చర్చించుకున్నారని తెలిపారు. తన కుమారుడితో కలిసి పనిచేయాలని, త్వరలో ఇద్దరం ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందని పవన్‌కు చంద్రబాబు చెప్పారన్నారు. ఈ విషయం కేంద్ర నిఘా వర్గాల ద్వారా తనకు తెలిసిందని పేర్కొన్నారు.
News March 6, 2026
INDvsENG మ్యాచ్.. ప్రపంచ రికార్డు

T20WC సెమీస్‌లో IND-ENG మధ్య థ్రిల్లర్ మ్యాచ్ డిజిటల్ వ్యూయర్‌షిప్‌లో ప్రపంచ రికార్డు సృష్టించినట్లు ICC ఛైర్మన్ జై షా వెల్లడించారు. జియో హాట్‌స్టార్‌లో ఏకకాలంలో 65.2 మిలియన్ల మంది వీక్షించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏ లైవ్ ఈవెంట్‌కైనా ఇదే అత్యధికమని పేర్కొన్నారు. స్పోర్ట్స్, మీడియా, స్ట్రీమింగ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తున్నందుకు గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.
News March 6, 2026
చనిపోయారన్న ఓటర్లను ఈసీ ముందు నిలబెడతా: మమత

SIRకు వ్యతిరేకంగా బెంగాల్ CM మమత కోల్‌కతాలో ధర్నా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TMCని ఓడించాలనే కుట్రతోనే BJP, EC కలిసి సర్ ప్రక్రియ చేపట్టాయని మండిపడ్డారు. ఇదొక సైలెంట్ రిగ్గింగ్ అని దుయ్యబట్టారు. బతికి ఉన్న ఓటర్లనూ చనిపోయినట్లుగా ప్రకటించారని ఆరోపించారు. వారందరినీ ఈ వేదిక సాక్షిగా ఈసీ ముందు నిలబెడతానని పేర్కొన్నారు. లక్షల మంది అర్హుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఫైరయ్యారు.


