News October 13, 2025
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి.. ఆదాయం జోరు

పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చి, డ్యామ్‌పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్క్‌లోని దుప్పులను వీక్షించారు. 496 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా, వైల్డ్ లైఫ్ శాఖకు ₹27,390 ఆదాయం లభించింది. 480 మంది బోటు షికారు చేయగా, టూరిజం కార్పొరేషన్‌కు కూడా భారీగా ఆదాయం వచ్చింది.
Similar News
News October 13, 2025
జూబ్లీహిల్స్‌లో BRSకు TRSతో ముప్పేనా?

గతంలో పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు BRSను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్‌లో తెలంగాణ రక్షణ సమితి- డెమోక్రటిక్(TRS- D) రూపంలో ముప్పు పొంచి ఉంది. పేరు, జెండా ఒకేలా ఉండటం, ఉద్యమ పార్టీ BRSగా మారినా చాలామందికి TRSగానే గుర్తు. దీంతో TRS(D) డ్యామేజ్‌పై గులాబీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. అటు కాంగ్రెస్‌కు బలమైన పోటీ కావడంతో ప్రత్యర్థులు ఈ కుట్ర చేశారని గులాబీదళం ఆరోపిస్తోంది.
News October 13, 2025
త్వరలో అమరావతి రైతులను కలుస్తా: CBN

AP: అమరావతి రైతులను <<17990155>>త్వరలో<<>> కచ్చితంగా కలుస్తానని, వారి త్యాగాలను గుర్తుంచుకుంటానని CM చంద్రబాబు అన్నారు. ఇవాళ చాలా ఆనందంగా ఉందని CRDA ఆఫీస్ ప్రారంభ కార్యక్రమంలో చెప్పారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ అమరావతిలోనే జరిగిందన్నారు. HYDను మించిన రాజధానిని నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని నదులన్నీ అనుసంధానం కావాల్సిన అవసరం ఉందన్నారు.
News October 13, 2025
ఏలేశ్వరం: గోతుల దారిలో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్

ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుంచి రాజవొమ్మంగి మండలంలోని చెరుకుంపాలెం వరకు రోడ్డు అద్వాన్నంగా ఉన్న విషయం తెలిసిందే. సోమవారం రాజవొమ్మంగి నుంచి ఏలేశ్వరం వెళుతున్న ఆర్టీసీ బస్సు టైర్ బోర్నగూడెం వద్ద ఊడిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. రోడ్డు దారుణంగా ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.