News April 28, 2024
కిర్లంపూడిలో నేడు పవన్ కళ్యాణ్ సభ: జ్యోతుల

కిర్లంపూడిలో ఆదివారం జరిగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని జగ్గంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్, జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జి దాట్ల కృష్ణ వర్మ, బీజేపీ నాయకురాలు కామినేని జయశ్రీ తదితరులతో నెహ్రూ సమావేశం నిర్వహించారు.
Similar News
News December 30, 2025
ప్రజల కోసమే పోలీసుల సేవలు: ఎస్పీ

తూర్పుగోదావరి జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన అధికారులను మంగళవారం సన్మానించారు. ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమానికి ఎస్పీ డి. నరసింహ కిశోర్ హాజరయ్యారు. పదవీ విరమణ చేసిన ఎస్సై డి. సత్యనారాయణ, ఎస్సై జి. రామకృష్ణ పరమహంస, ఎఎస్సై కే. జయలక్ష్మి, ఎఆర్ఎస్ఐ ఎం.రాధాకృష్ణలను ఎస్పీ సన్మానించారు. పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. సర్వీసులో వారు అందించిన సేవలను కొనియాడారు.
News December 29, 2025
మంత్రితో సినీ దర్శకుల భేటీ.. పరిశ్రమ అభివృద్ధిపై చర్చలు!

విజయవాడలో పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్(TFDA) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో అసోసియేషన్ బలోపేతం, సినీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పరిశ్రమ పురోభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధుల బృందం పాల్గొన్నారు.
News December 29, 2025
చినవెంకన్న సన్నిధిలో ముక్కోటికి ముస్తాబు.. MLA, కలెక్టర్ పరిశీలన

చినవెంకన్న క్షేత్రంలో మంగళవారం జరగనున్న ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లను MLA మద్దిపాటి వెంకటరాజు, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కిషోర్‌తో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, మంచినీరు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని MLA పేర్కొన్నారు.


