News March 1, 2025
కిర్లంపూడి: ఆటోను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

కిర్లంపూడి మండలం సోమవరం జంక్షన్ వద్ద NH-16పై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ నూకరాజు(47) మృతి చెందాడు. కిర్లంపూడి పోలీసుల వివరాల ప్రకారం.. సోమవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నూకరాజు ఖాళీ వాటర్ కేన్‌లతో ఆటోపై ఇంటికి వస్తుండగా వైజాగ్ వైపు వెళుతున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిర్లంపూడి ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 1, 2025
NZB: యాసంగిలో ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఎరువులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందన్నారు. గతేడాది రబీలో 63 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగించగా, ఈ సారి 77 వేల మెట్రిక్ టన్నులకు ఎరువుల డిమాండ్ పెరిగిందని వివరించారు.
News March 1, 2025
దివ్యాంగులకు ఇక నుంచి UDID కార్డులు

TG: సదరం సర్టిఫికెట్లకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. దివ్యాంగులకు ఇక నుంచి యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డు(UDID) ఇవ్వాలని నిర్ణయించింది. సదరం సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులందరికీ UDID నంబర్ జనరేట్ చేయాలని జిల్లా కలెక్టర్లను సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ కార్డులు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. మీ సేవల్లో స్లాట్ బుక్ చేసుకుని, సదరం క్యాంపుకు వెళ్తే UDID ఇస్తారు.
News March 1, 2025
నేలపై కూర్చుని తింటున్నారా?

డైనింగ్ టేబుల్ కాకుండా నేల మీద కూర్చుని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘ప్లేట్‌లోని ఆహారాన్ని వంగి తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. కండరాలు, శారీరక నొప్పులు దూరమవుతాయి. భోజనం ఎంత తింటున్నామో జ్ఞప్తిలో ఉంటుంది. తద్వారా బరువును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నేలపై కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది’ అని పేర్కొంటున్నారు.* మీరు ఎలా తింటారు? కామెంట్ చేయండి.