News November 10, 2025

కిర్లంపూడి: నలుగురికి చేరిన మృతుల సంఖ్య

image

కిర్లంపూడి మండలం ఎన్.హెచ్. 16 జాతీయ రహదారిపై ఈ నెల 8న ఓ పెళ్లి కారు ఢీకొనడంతో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జగ్గంపేట మండలం ఇర్రిపాకకు చెందిన యువతి కూండ్రపు దుర్గా చైతన్య సోమవారం ఉదయం కన్నుమూసింది. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య నాలుగుకు చేరింది.

Similar News

News November 10, 2025

భారీ జీతంతో ESIC నోయిడాలో ఉద్యోగాలు

image

<>ESIC<<>> నోయిడా 10 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి MBBS, డిప్లొమా, MD, MS, DNB, MSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు ప్రొఫెసర్‌కు రూ.2.22లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1.47లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.27లక్షలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in/

News November 10, 2025

మెదక్: ‘జీవో నంబర్ 34 అమలు చేయాలి’

image

వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని జీవో నంబర్ 34లో అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేశారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. వికలాంగుల సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌కు వినతిపత్రం సమర్పించారు. మూడేళ్ల క్రితం ప్రభుత్వం జీవో తీసుకువచ్చిన నేటికీ అది అమలు కావడం లేదని, వెంటనే 34 జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

News November 10, 2025

టెర్రరిస్ట్ అరెస్ట్.. ఇంట్లోనే విషపదార్థం తయారీ!

image

గుజరాత్ పోలీసులు <<18243395>>అరెస్ట్<<>> చేసిన HYD వ్యక్తి డా.మొహియుద్దీన్ రైసిన్ అనే విష పదార్థాన్ని తయారుచేసినట్లు వెల్లడైంది. ఇతడు చైనాలో MBBS చదివాడు. ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాల నుంచి రైసిన్‌ను తయారుచేసి, దాన్ని ప్రజలపై ప్రయోగించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. రైసిన్‌ను పెద్ద మొత్తంలో పీల్చినా, ఆహారం/నీటి ద్వారా తీసుకున్నా ప్రాణాలు పోయే ప్రమాదముంటుంది.