News January 21, 2025

కిర్లంపూడి: రహదారి ప్రమాదంలో స్నేహితుల మృతి

image

కాకినాడ జిల్లాకు చెందిన దాసరి నిమ్స్ చంద్ర(23), ముక్త దుర్గ బాబు(24)లు బైక్‌పై వెళ్తుండగా విజయవాడ హైవేపై నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. నిమ్స్‌చంద్ర తండ్రి ఆటో డ్రైవర్, తల్లి అంగన్ వాడీ కార్యకర్త. కిర్లంపూడికి చెందిన ముక్తదుర్గసాయి తమ్ముడు 10 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇప్పుడు కుమారుడి మరణంతో తల్లిదండ్రులు ముత్తా పెద్దకాపు, సరస్వతి విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

Similar News

News February 17, 2026

JEE మెయిన్స్‌లో ‘తిరుమల’ విద్యార్థుల జయకేతనం

image

JEE MAIN 2026 సెషన్-1 ఫలితాలలో రాజమహేంద్రవరంలోని TIRUMALA IIT & అండ్ మెడికల్ విద్యార్థి డి.శ్రీవేద్ 99.999 పర్సంటైల్ సాధించారు. SC కేటగిరిలో శ్రీవేద్ ఆలిండియా టాపర్‌గా నిలిచారని TIRUMALA విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. అలాగే ఎం.కృష్ణ శరవణ సాకేత్ 99.99, జీ.వాత్సల్యకు 99.98, ఆర్.చరణ్ తేజ 99.98 పర్సంటైల్ సాధించారన్నారు. ఉత్తమ స్కోర్లను సాధించినవారిని ఆయన అభినందించారు.

News February 17, 2026

బీజేపీ పథకాలు ప్రతి గడపకూ చేరాలి: పురందీశ్వరి

image

తూర్పు గోదావరి జిల్లా BJP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మైనారిటీ, ఎస్సీ మోర్చా సమావేశంలో MP పురందీశ్వరి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఎస్సీ, మైనారిటీ వర్గాల సాధికారత, ఆర్థిక పురోగతికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా మోర్చా నాయకులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఆమె సూచించారు.