News September 13, 2025
కిలో టమాటా రూ.4

నిన్న, మొన్నటి వరకు మంచి ధర పలికిన టమాటా రేటు ఒక్కసారిగా పడిపోయింది. కర్నూలు(D) పత్తికొండ, నంద్యాల(D) ప్యాపిలి మార్కెట్లలో కిలో రూ.4 నుంచి రూ.6 మాత్రమే పలికింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలులేక కొందరు పొలాల్లోనే వదిలేస్తుంటే.. కూలీలను పెట్టి కోయించినా గిట్టుబాటు ధర రావటం లేదని మరికొందరు రైతులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.30కి అమ్ముతున్నారు.
Similar News
News March 26, 2026
ఏసీబీకి చిక్కిన మామడ ఎస్సై

లంచం తీసుకుంటూ నిర్మల్ జిల్లా మామడ ఎస్సై అశోక్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ రియల్టర్ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించేందుకు రూ. 40 వేలు డిమాండ్ చేయగా, రూ. 20 వేలకు ఒప్పందం కుదిరింది. బాధితుడి ఫిర్యాదుతో గురువారం ఏసీబీ అధికారులు ఉచ్చు పన్ని నగదు తీసుకుంటుండగా ఎస్సైని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
News March 26, 2026
నియోజకవర్గాలు 50శాతం పెరుగుతాయి: చంద్రబాబు

నియోజకవర్గాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 50శాతం నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. దీని ద్వారా ఎక్కువ మందికి రాజకీయ అవకాశాలు వస్తాయని చెప్పారు. నియోజకవర్గాల పెంపు వల్ల పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని, దీనిపై ప్రజలకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు.
News March 26, 2026
ఇబ్రహీంపట్నం: వాటర్ గ్రిడ్‌ను పరిశీలించిన కలెక్టర్

ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలోని వాటర్ గ్రిడ్‌ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. జిల్లాలో తాగునీటి సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్న కలెక్టర్, వాటర్ గ్రిడ్ నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం శుద్ధి చేసిన తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత పనులను సమయానికి పూర్తి చేసి నీటి సరఫరాను మెరుగుపరచాలన్నారు.


