News February 28, 2026
కివీస్ ఓటమి.. పాక్‌కు దక్కిన లైఫ్ లైన్!

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో న్యూజిలాండ్ తన సెమీఫైనల్ బెర్తును ప్రమాదంలో పడేసుకుంది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఎటువంటి లెక్కలతో పని లేకుండా నేరుగా సెమీస్‌కు వెళ్లేవాళ్లమని, మా పని సులువు అయ్యేదని కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాటింగ్‌లో విఫలమయ్యామని అంగీకరించారు. కివీస్ ఓటమి పాక్‌కు కలిసొచ్చింది. నేడు శ్రీలంకపై భారీ తేడాతో గెలిస్తే సెమీస్‌లోకి దూసుకెళ్లే ఛాన్స్ ఉంది.
Similar News
News February 28, 2026
కీరదోసలో బూడిద తెగులును ఎలా నివారించాలి?

కీరదోసలో బూడిద తెగులు ఆశిస్తే ఆకుల ఉపరితలంపై, కాడలపై తెల్లటి బూడిద వంటి పొడి ఏర్పడుతుంది. ఉద్ధృతి ఎక్కువైతే కాండం, పూతపై కూడా ఈ పొడి కనిపిస్తుంది. ఇది ఆకు మొత్తం కప్పేసి చివరికి ఆకులు పసుపు రంగులోకి మారి కాండంతో సహా ఎండిపోతాయి. దీనివల్ల మొక్కలు బలహీనపడతాయి. బూడిద తెగులు నివారణకు లీటరు నీటికి థయోఫనేట్ మిథైల్ (75% WG) 2.5 గ్రా. లేదా బినామిల్ 50% WP 0.4 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.
News February 28, 2026
‘ది కేరళ స్టోరీ-2’కి షాకింగ్ కలెక్షన్లు

<<19244440>>వివాదాస్పదమైన<<>> ‘ది కేరళ స్టోరీ-2’ మూవీకి ఆదరణ కరవైంది. రూ.30Crతో తీసిన ఈ చిత్రం తొలిరోజు నిన్న రూ.3.5Cr వసూలు చేసింది. కేరళలో అయితే థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బుక్ మై షో ప్రకారం తిరువనంతపురంలోని PVRలో 4 షోలకు 68 టికెట్లే బుక్ అయ్యాయి. తొలి నుంచి ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న DYFI కార్యకర్తలు థియేటర్ల ముందు నిరసనలకు దిగారు. కాగా 2023లో వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ మాత్రం బ్లాక్‌బస్టర్ అయింది.
News February 28, 2026
పెదవులు నల్లగా మారాయా?

రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం, ఒత్తిడి, డ్రగ్స్, స్మోకింగ్ వల్ల పెదాలు నలుపు రంగులోకి మారుతుంటాయి. హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా కూడా కొన్నిసార్లు కారణమవుతుందంటున్నారు నిపుణులు. కొబ్బరినూనె, తేనె, చక్కెర కలిపి పెదాలకు ప్యాక్ వేసి స్కబ్ చేయాలి. అలాగే పాలు, పసుపు ప్యాక్ వేయడం వల్ల కూడా పెదాల రంగు మారుతుంది. అలోవెరా జెల్, రోజ్ వాటర్, నెయ్యి, స్ట్రాబెర్రీ వంటివి పెదాలకు అప్లై చేసినా ఫలితం ఉంటుంది.


