News October 11, 2025
కిశోరి బాలికల కోసం “కిశోరి వికాసం 2.0..!

బాపట్ల జిల్లాలో కిశోరి బాలికల కోసం “కిశోరి వికాసం 2.0” ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో కిశోరి బాలికల పూర్తి సాధికారత కోసం నాణ్యమైన విద్య, సంపూర్ణ ఆహార ఆరోగ్యం, లింగ సమానత్వం, నైపుణ్యాభివృద్ధి, బాల్య వివాహాలను అరికట్టుట, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, మానవ అక్రమ రవాణా, ఆత్మ రక్షణ వంటి 12 కీలక అంశాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News October 11, 2025
2,253 పదాలతో పేరు.. గిన్నిస్ రికార్డు

మీ పేరులో ఎన్ని పదాలు ఉంటాయి. గరిష్ఠంగా అయితే 7-10 వరకు ఉండొచ్చు. కానీ న్యూజిలాండ్‌కు చెందిన లారెన్స్ పేరు ఏకంగా 2,253 పదాలతో ఉంది. రికార్డుల కోసం కొందరు చేసే విచిత్రమైన పనులను చూసి తనకు ఈ ఆసక్తి కలిగిందని లారెన్స్ తెలిపారు. 1990లో పేరును 2వేలకు పైగా పదాలకు పెంచుకొనేందుకు కోర్టును ఆశ్రయించగా ఇటీవల అనుమతి వచ్చింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద పేరు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కాడు.
News October 11, 2025
VZM: పెళ్లి ఇష్టం లేదని యువతి ఆత్మహత్య

వివాహం చేసుకోమని ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో అయ్యకోనేరు గట్టు చెరువులో పడి యువతి ఆత్మహత్య చేసుకుంది. టౌన్ ఎస్ఐ కనకరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బెహరా రమ్య(18) డిగ్రీ చదువుతోంది. వివాహం చేస్తామని ఆమెకు చెప్పగా ముందు తన అన్నయ్యకు చేయమంది. వినకుండా బలవంతం చేయడంతో శుక్రవారం రాత్రి ఇళ్లు వదిలి వెళ్లిందన్నారు. ఈరోజు చెరువులో మృతదేహం తేలడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
News October 11, 2025
చంద్రబాబుకు ప్రధాని మోదీ అభినందనలు

సీఎంగా 15 ఏళ్ల మార్కును అధిగమించిన చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆయన విజన్, సుపరిపాలన పట్ల ఉన్న నిబద్ధత రాజకీయ జీవితంలో స్థిరంగా కొనసాగేలా చేస్తున్నాయని కొనియాడారు. తాను సీఎంగా ఉన్న సమయంలోనూ చంద్రబాబుతో కలిసి పనిచేసినట్లు చెప్పారు. ఏపీ సంక్షేమం కోసం ఉత్సాహంతో పనిచేస్తున్న ఆయనకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.