News November 20, 2024
కిశోరి వికాసం.. బాలిక బంగారు భవిష్యత్‌కు పునాది: కలెక్టర్
కిశోరి వికాసం-2 కార్యక్రమం బాలికల బంగారు భవిష్యత్‌కు పునాది వేస్తుందని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా అన్నారు. ఉజ్వలమైన, ఆరోగ్యకరమైన, సాధికారత దిశగా వేసే అడుగుకు సమష్టి కృషితో చేయూతనిద్దామని పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడ కలెక్టరేట్‌లో కిశోరి వికాసం-2 కార్యక్రమాన్ని ప్రారంభించారు. కిశోరి వికాసం పునఃప్రారంభం ప్రతి బాలిక భవిష్యత్తును మెరుగుపరచడానికి ఓ మంచి కార్యక్రమన్నారు.
Similar News
News January 28, 2025
పెనమలూరులో మృతదేహం కలకలం
పెనమలూరులో మృతదేహం కలకలం రేపింది. పెనమలూరు ఎస్సై ఉషారాణి.. తెలిపిన సమాచారం ప్రకారం తాడిగడప కాలువ గట్టు వద్ద సోమవారం సాయంత్రం మృతదేహం ఉందన్న సమాచారం మేరకు వెళ్లి పరిశీలించామన్నారు. ఈ క్రమంలో అక్కడ 35 నుంచి 40 సంవత్సరాల మగ మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉందన్నారు. మృతుడి వంటిపై నలుపు రంగు షర్టు, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు.
News January 28, 2025
మచిలీపట్నం: మీకోసంలో 31 ఫిర్యాదులు
ప్రజా సమస్యలకు నిర్ణీత సమయంలో పరిష్కారమందించాలని ఎస్పీ ఆర్. గంగాధర్ రావు అన్నారు. సోమవారం మచిలీపట్నంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 31 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం వాటి పరిష్కార మార్గాలు చూపారు.
News January 27, 2025
దేవాలయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఎస్పీ
కృష్ణా జిల్లాలోని ఉన్న అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థన మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ గంగాధర్ రావు అధికారులకు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఎస్పీ సోమవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. స్నేహపూర్వక పోలీసింగ్ ప్రజలకు అందిస్తూ, మహిళలు, చిన్నారుల భద్రతపై దృష్టి సారించాలన్నారు.