News March 3, 2025
కిషన్ రెడ్డిని కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్

ఇటీవల సిద్దిపేట బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బైరి శంకర్ ముదిరాజ్ సోమవారం హైదరాబాదులో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శంకర్‌కు శాలువా కప్పి నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందించారు. నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కిషన్ రెడ్డి సూచించారు.
Similar News
News September 17, 2025
పేట్ల బురుజులో పోలీసుల శిశు సంరక్షణ కేంద్రం

మహిళా పోలీసుల కోసం నూతన శిశు సంరక్షణ కేంద్రాన్ని నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ బుధవారం ప్రారంభించారు. పేట్లబురుజులోని సీఏఆర్ ప్రధాన కార్యాలయంలో మహిళా పోలీసు అధికారుల పిల్లల కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. 150-200 మంది పిల్లలకు ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. మహిళా ఉద్యోగులు తమ పిల్లలను డ్యూటీ ప్రదేశానికి తీసుకువస్తే వారి సంరక్షణకు ఈ కేంద్రం ఎంతో భరోసా ఇస్తుందన్నారు.
News September 17, 2025
ASIA CUP: పాక్-UAE మ్యాచ్ రిఫరీగా పైక్రాఫ్ట్

తమ మ్యాచ్‌కు రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌ను తప్పించాలన్న పాక్‌కు ICC షాక్ ఇచ్చింది. పాక్-UAE మ్యాచ్‌కు అతడినే రిఫరీగా కొనసాగిస్తోంది. మరోవైపు హ్యాండ్ షేక్ వివాదంపై పైక్రాఫ్ట్ తాజాగా తమకు క్షమాపణ చెప్పాడని పీసీబీ క్లెయిమ్ చేసుకోవడం గమనార్హం. అటు మ్యాచులో పాక్‌కు UAE షాక్ ఇస్తోంది. తొలి ఓవర్‌లో ఓపెనర్ అయూబ్‌ను డకౌట్‌గా వెనక్కి పంపింది. పాక్ 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది.