News February 25, 2026

కీరదోసలో బూజు తెగులు – నివారణ

image

కీరదోసలో ఈ తెగులు ఆశిస్తే ఆకు అడుగు భాగంలో బూజు మాదిరిగా ఏర్పడుతుంది. తెగులు ఉద్ధృతి ఎక్కువైతే ఆకు అడుగున ఊదారంగు మచ్చలు, పైభాగాన పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు త్వరగా ఎండిపోయి రాలిపోతాయి. అధిక తేమ, పొగ మంచు ఈ తెగులు వ్యాప్తికి కారణమవుతాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి మాంకోజెబ్‌ 64% WP 3 గ్రాములను కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.

Similar News

News February 25, 2026

ఘోరం.. ఏడుస్తున్నాడని బిడ్డను నిప్పుల్లో వేసిన తల్లి

image

TG: బిడ్డ ఏడిస్తే ఓర్పుగా లాలించాల్సిన తల్లే సహనం కోల్పోయి దారుణానికి పాల్పడింది. 2 రోజులుగా బిడ్డ ఏడుస్తున్నాడనే కోపంతో 2 నెలల పసికందు నోట్లో గుడ్డలు కుక్కేసి, కాళ్లు, చేతులు కట్టేసి నిప్పుల్లో పడేసింది. దీంతో ఆ బిడ్డ సజీవ దహనమయ్యాడు. ఈ అమానవీయ ఘటన మేడ్చల్(D) దుండిగల్‌లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి తల్లి మమత మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. MPకి చెందిన ఈమె భర్తతో కలిసి వలస వచ్చింది.

News February 25, 2026

మహిళల్లో రక్తహీనత ఎందుకు వస్తుందంటే?

image

ఎనీమియా రావడానికి ఐరన్ లోపం ప్రధాన కారణం. నెలసరిలో అధిక రక్తస్రావం, ఏదైనా కారణం వల్ల జీర్ణాశయం, మూత్రాశయ మార్గాల్లో అంతర్గతంగా రక్తస్రావం కావడం వల్ల కూడా రక్తం తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ వంటివి శరీరానికి అందేలా చూసుకోవాలి. పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు.. వంటివన్నీ తగినంతగా తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి సమతులంగా పోషకాలు అందుతాయి.

News February 25, 2026

డయేరియా, కల్తీ పాల ఘటనలపై సీఎం సమీక్ష

image

AP: శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ పాల ఘటనలపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఒకరు వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని, మరొకరికి డయాలసిస్ అందిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. శ్రీకాకుళం ఘటనలో 76 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు.