News February 25, 2025

కీసరగుట్టకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు

image

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి మహా శివరాత్రి జాతర సందర్భంగా TGSRTC గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్, సోమవారం కీసరగుట్ట బస్ ప్రయాణ ప్రాంగణంలో జాతర స్పెషల్ క్యాంప్‌ను ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం కుషాయిగూడ కంటోన్మెంట్ హకీంపేట ఉప్పల్, చెంగిచెర్ల డిపో నుంచి ECIL భక్తుల సౌకర్యార్థం, సికింద్రాబాద్ స్టేషన్, ఘట్కేసర్‌లలో ప్రత్యేక బస్సులు నడపనున్నామని తెలిపారు.

Similar News

News February 22, 2026

NGKL: SLBC ఘటన.. దొరకని ఆరుగురి ఆచూకీ

image

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం కూలిన భారీ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తయింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూగర్భ ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో జయప్రకాశ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాకపోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మట్టి దిబ్బల కిందే తమ వారు కలిసిపోయారన్న వేదనలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు.

News February 22, 2026

అనకాపల్లి: పాముకాటుతో 3 ఏళ్ల బాలుడి మృతి

image

ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిని పాము రూపంలో మృత్యువు కబలించింది. ఈ ఘటన శనివారం జరిగింది. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం మోసయ్యపేట గ్రామానికి కిరణ్ (3) ఇంటి బయట ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన బాలుడి అమ్మమ్మ గోవిందమ్మ హుటాహుటిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన డాక్టర్ పాముకాటుతో మృతి చెందినట్లుగా నిర్ధారించారు.

News February 22, 2026

ఆదిలాబాద్ ‘బడా’ నేతలకు తప్పని భంగపాటు

image

ADB మున్సిపల్ ఎన్నికల్లో ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న’ నానుడి ప్రధాన పార్టీల నేతల విషయంలో తలకిందులైంది. మాజీ మంత్రి జోగు రామన్న తన కుమారుడిని 34వ వార్డులో గెలిపించుకోలేకపోయారు. అలాగే కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి, గండ్రత్ సుజాత, బీజేపీ నేత సుహాసిని రెడ్డి తమ సొంత వార్డుల్లోనే అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. దిగ్గజ నేతల ఇలాకాలో ఓటమి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.