News November 15, 2024
కీసర గుట్టకు ప్రత్యేక జిల్లా బస్సులు
కీసర గుట్టకు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి నుంచి సిటీ బస్సులే కాకుండా వికారాబాద్, వరంగల్, సిద్దిపేట సహా పలు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. మరోవైపు నగరం నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులను కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే కీసర గుట్ట వద్ద భక్తులు బారులు తీరారు.
Similar News
News November 15, 2024
HYD: రాత్రిళ్లు మహిళల అసభ్య ప్రవర్తన.. హెచ్చరిక
హైదరాబాద్‌లోని ప్రధాన సర్కిళ్లలో పురుషుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజాగా చైతన్యపురి PS పరిధిలో రాత్రి సమయంలో దారిన పోయే వ్యక్తులను ఇబ్బంది పెడుతున్న 9 మంది మహిళలను సరూర్‌నగర్ తహశీల్దార్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఇక మీదట ఇలా ప్రవర్తిస్తే రూ.2 లక్షల జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని MRO హెచ్చరించారు.
SHARE IT
News November 15, 2024
ఉస్మానియా యూనివర్సిటీలో ప్రిన్సిపల్స్ నియామకం
ఓయూ, ఓయూ పరిధిలోని మరికొన్ని కళాశాలలకు ప్రిన్సిపళ్లను నియమిస్తూ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలకు ప్రొ ఖాసీం, సైన్స్ కళాశాలకు ప్రొ. ప్రభాకర్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలకు ప్రొ.శేఖర్, లా కళాశాలకు డా.రాం ప్రసాద్, టెక్నాలజీ కళాశాలకు ప్రొ. రమేశ్ కుమార్, నిజాం కళాశాలకు ప్రొఫెసర్ ఏవీ రాజశేఖర్, సైఫాబాద్ సైన్స్ కళాశాలకు ప్రొ.కే. శైలజ నియమితులయ్యారు.
News November 15, 2024
కార్తీకపౌర్ణమి: HYDలో అంతా శివోహం!
కార్తీకపౌర్ణమి సందర్భంగా HYDలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. దీపాలు వెలిగించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఆలయాల్లో లింగాలను అందంగా అలంకరించారు. శివుడికి రుద్రాభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. కీసర, శ్రీశైలం స్వామివార్లను దర్శించుకునేందుకు వందలాది మంది నగరం నుంచి బయల్దేరుతున్నారు.